మనుషులు నాలుగు రకాలు. ;- - జయా
 వీరిలో ఒకరు... తెలిసినవాడు! తనకు తెలుసునని తెలిసినవాడు!  ఇతను పండితుడు. కనుక ఓపికగా అతని నుంచి నేర్చుకోవాలి.
రెండో వర్గం ... తెలిసిన మనిషి! కానీ తనకు తెలుసన్న నిజాన్ని తెలుసుకోలేని మనిషి.  ఆ విషయాన్ని మరచిపోయిన మనిషి. కనుక అటువంటి మనిషికి  గుర్తు చేయాలి నీకు తెలుసురా అని. 
మూడో వర్గం...తెలియని మనిషి! తనకు తెలియదని తెలిసినవాడు! ఇతను ఒక విద్యార్థిలాంటివాడు. కనుక అతనికి నిరంతరం బోధించాలి. ఎందుకంటే అతను ఏదో ఒక రోజు గొప్ప పండితుడవుతాడు.
ఇక వాలుగో వర్గం... తనకు తెలియదని, తనకు తెలియని దానిని తెలుసుకోవాలనే  ఆసక్తి లేని వ్యక్తి.  ఇతనొక మూర్ఖుడు. కనుక అతనికి చెప్పాలనుకోవడం వృధా ప్రయాస. 
తమిళంలో చదివాను. రచయిత ఎవరో తెలీదు. బాగుందనిపించి నా పైత్యం కొంత జోడించి రాశాను.

కామెంట్‌లు