పఠనం మొక్క నాటండి!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
పఠనం ఒక్కటే ఎప్పుడైనా ఎక్కడైనా చేసేది.

భారతీయ భాష దేశ పటంలో చోటిస్తే
ఆంగ్ల భాష ప్రపంచ పటంలో చోటిస్తుంది.

పఠనం మొక్కటే 
ఏ భాష కైనా పాఠం చెబుతుంది
ప్రపంచానికి గుణపాఠం చెప్తుంది!!!

పఠనం మొక్క నాటితే
ప్రపంచానికి ఫలాలను ఇస్తుంది
ప్రతి ఒక్కరికి ఉత్తమ ఫలితాలనిస్తుంది!!

వీడియోలు ఆడియోలు వాడుకుంటే
సమయం ఆదా అవుతుంది
సమాచారం సంజీప్తంగా నిక్షిప్తం అవుతుంది.
సౌకర్యంగా ఉంటుంది. కానీ

పఠించడం వల్ల
సమయాన్ని సరిగ్గా వినియోగిస్తాం.
మానసిక శక్తి రెట్టింపు అవుతుంది

మానసిక తృప్తి సంతృప్తిమిగురుతుంది.
మనశ్శాంతి కలుగుతుంది.

ఎక్కువ మాట్లాడాలన్నా
మాట్లాడకుండా ఉండాలన్న
పఠనమే సరియైనది.!!!!....!

జ్ఞానానికి జ్ఞాపకశక్తికి
ముఖ్యఅతిథి పఠనం!!!!

ఏదైనా మళ్లీ మళ్లీ చదవడం వల్ల
కంఠస్థం చేయొచ్చు జ్ఞాపకం పెట్టుకోవచ్చు!!
కానీ
మళ్లీ మళ్లీ చూడటం వల్ల
మళ్లీ మళ్లీ వినటం వల్ల
మార్పు మామూలు అవుతుంది.!
మరుపు మామూలు అవుతుంది.!!
మతిమరుపు మొదలవుతుంది.!!!?

ప్రతిభావంతులంతా పఠిస్తారు
పఠనం వల్ల ప్రతిభావంతులవుతారు!!

పఠనం మొక్క నాటండి
ప్రతి ఒక్కరూ
పఠనానికి చేతులెత్తి మొక్కండీ....!!!

పాఠశాల విద్యాశాఖ పఠనోత్సవాలను పురస్కరించుకొని.
Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏

కామెంట్‌లు
తల్లీ నమస్తే పఠనావశ్యకతను చక్కగా వివరించారు. ఈ అలవాటు లేమిచేత నేటి విద్యార్థి లోకం మానసిక ఒత్తిడి వంటి జాఢ్యం నుండి బయట పడలేక నరకం అనుభవిస్తుంది. మంచి రచననందించారు. ధన్యవాదములు.

నాకు అర్థం కాని పాదాలు....రెండున్నాయి. అవి...

పఠనం మొక్కటే
సమాచారం సంజీప్తంగామౌళిపాలక
జయపురం
ఒడిశా
28062023


తల్లీ నమస్తే పఠనావశ్యకతను చక్కగా వివరించారు. ఈ అలవాటు లేమిచేత నేటి విద్యార్థి లోకం మానసిక ఒత్తిడి వంటి జాఢ్యం నుండి బయట పడలేక నరకం అనుభవిస్తుంది. మంచి రచననందించారు. ధన్యవాదములు.

నాకు అర్థం కాని పాదాలు....రెండున్నాయి. అవి...

పఠనం మొక్కటే
సమాచారం సంజీప్తంగామౌళిపాలక
జయపురం
ఒడిశా
28062023