అనల వేదిక (చిట్టి వ్యాసం)- -డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మన జీవితం రసమయం, సరసమయం, నవరసమయం, సమరసమయం. పూచిన పున్నమిరాత్రిలో యమునా సుందరతీరంలో సైకతవేదిక నాట్యం. ప్రేమధామాలలో దాగుడుమూతల క్రీడ.
పూర్ణతృప్తితోనిండిన సరసహృదయాల కేళీవిలాసం. అమృత మాధుర్య వాక్కుల గుసగుసలు. కాని, కలిపురుషుడి మాయతో మనజీవితాలు అల్లకల్లోలమయ్యాయి. మనలో అహంకారాన్ని, దర్పాన్ని, స్వార్థాన్ని, దురాశను కలుగజేసి మనలోమనకే అంతరాలు సృష్టించి, మనను అనలవేదికపైకి ఎక్కించి, మనలోని నమ్రతను, దయను, త్యాగాన్ని, అవగాహనను నిప్పులసెగలతో ధూమంగా మార్చి మననుండి దూరం చేస్తున్నాడు. మన పవిత్ర హృదయాలను ఆగ్రహావేశాలతో, అసూయాహింసలతో
కలుషితం చేస్తున్నాడు. ఇకమనం "అన్యథా శరణంనాస్తి త్వమేవ శరణంమమ" అంటూ
ఆ భగవంతునిమ్రోల వాలితేచాలు అన్నికష్టాలూ తీరిపోతాయి!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు