"ఇదేనా.... ధర్మం.... !";(* చిత్రకవిత *) = కోరాడ నరసింహా రావు.
అవకాశవాద సమాజంలో... 
చట్టన్యాయాలు... 
  నేతిబీరకాయలో నెయ్యి లాంటివే... !

  రుజువులు, సాక్ష్యాల లొసుగులో... 
.   నేరస్తుల స్వైర విహారం !!

న్యాయదేవత కళ్ళకు గంత లుకట్టటం కాదు... స్పష్టంగా చూడటానికి సరైన కళ్లద్దాలు, 
సు,సుబోధకంగా  వినిపించటానికి. మంచి చెవిటిమిషను పెట్టాల్సిందే !

  నేరస్టుల్ని జీవితాంతం మేపటంకాదు, 
  నేరం చేసాడని తేలిన వెంటనే 
తత్క్షణమే... తలనరకటానికి 
న్యాయదేవత చేతికి పదునైన పెద్ద ఖడ్గాన్ని  సిద్ధంగా ఉంచాల్సిందే !!

ఈ విధానాలు పాటిస్తే... ఇన్నిన్ని నేరాలు పెరిగిపోయేవా
ఎంతోమందిఅమాయకులుఇలా  బలైపోతూవుండేవారా...!? 

ఒక్కనిర్దోషికూడా శిక్షింప బడకూడదు నిజమే..., 
ఆ సాకుతో... వేల మంది నేరస్తుల్ని కళ్లేలు లేని పొగరుబోతు గుర్రాలను చేసి... 
  సమాజం మీదకు వదలటం న్యాయమా... !?
 ఇదేనా... ధర్మం.. ?!
......******

కామెంట్‌లు