సుప్రభాత కవిత ; - బృంద
మదిగోడలపై జ్ఞాపకాల
చిత్రాలు నింపుకుని
ఒకొక్కదానినీ ఆత్మీయంగా
స్పృశిస్తూ.....

మనసులోని తడిని
కనుల లోకి తెచ్చుకుంటూ
గతంలోకి వెళ్ళిపోతూ
చిరునవ్వులు పెదవంచున పూయించుకుంటూ..

గురుతొచ్చిన కలతలకు
గుండెలోనే వెక్కుతూ...
కనుమరుగయినవీ
మనసున నిలిచినవీ
మరపురానివి మరువలేనివీ

నిశిని కలిగిన తలపులన్నీ
ఉష రాక తెలియగనే
తలుపులు మూసేసుకుని
రెప్పలపై కూచున్న కలలన్నీ...

విరిసిన పువ్వులై
విరబూసిన నవ్వులై
కంటివిందుగ  ముందు నిలిచి
కలిసి నవ్వమని పిలుస్తుంటే...

అద్వైతమై అంతరంగం
అందాల ప్రకృతితో మమేకమై 

పరవశిస్తూ పరిమళిస్తూ 
పరుగులు పెడుతూ....

మబ్బులు కమ్మిన  నింగిని
మనసారగా కురిసిపొమ్మని
మదితీరగా తడిపిపొమ్మని
ఆత్మీయ స్వాగతమిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు