పదండిపోదాం (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 కోయిల గానం, ఊరపిచ్చుకల అల్లరి,
మల్లె మాలతీ లతలు, బంతి చామంతులూ, పశువుల కొట్టాలూ, ధాన్యపురాసుల గలగలలూ, వాగులూ వంకలూ చెరువులూ, ఈదులాటలూ,
గుడిగంటలు, బడిగంటలు, పశువుల మెడలోగంటలు, వెన్నెల్లో కోలాటాలు, భాగోతులు, ఆటపాటలు, భూతల్లికి పచ్చటిచీర చుట్టినట్లు జనాలకు భోజనాలందించే ఆకుపచ్చటి చేలు.
ప్రతిఇల్లూ నందనవనమే. ప్రతిఇల్లాలూ అన్నపూర్ణాదేవియే. ప్రతితల్లీ ఒక బతుకమ్మ. ప్రతిపిల్లా ఒకబొడ్డెమ్మ.
నోములూ వ్రతాలూ,పూజలూ దానాలూ, ప్రార్థనలూ నమాజులూ, అస్సైదూలాలు కోలాటలూ, గంగిరెద్దులూ భాగోతాలూ, హరికథలూ పురాణాలూ అన్నీ అందరివి. అందరికీ హడావుడే. స్వఛ్ఛమైన మనసులున్న సుస్నిగ్ధపు నవ్వులున్న ప్రతిపల్లె నందగోకులమే. వాళ్ళంతా బంధువులే. ఎవరేంచేసినా ఊరంతా ఒక్కటే. పెళ్ళైనా పేరంటమైనా, కష్టమైనా సుఖమైనా అంతాకలిసే పంచుకుంటారు. కలిసే అనుభవిస్తారు. అందుకే ఆ చల్లని ప్రపంచం ఒడిలోకి ఆ పచ్చని పల్లె ఒడిలోకి పదండిపోదాం!!!
+++++++++++++++++++++++++
.
కామెంట్‌లు