శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 దిగ్గజం అంటే ఏనుగు నాల్గు దిక్కులు ఉన్నవి.పురాణాల ప్రకారం 8దిక్కుల అష్టదిగ్గజాలున్నాయి.తూర్పున ఐరావతం దక్షిణంలో వామన పడమట అంజనా  ఇంకా పుండరీక కుముద పుష్పదంత సప్రతీక.వీటిని హిందీ లో దిశికుంజర్ దిక్ స్థంభాలు అని కూడా అంటారు.శివుని తాండవంతో అవి స్థానచ్యుతి పొందాయి.భారీ వాటికి గొప్ప వారి కి వాడుతుంటాం.శ్రీకృష్ణదేవరాయలు పెద్దన మొదలైన అష్టదిగ్గజాలు కవులు ఉండేవారు.
పూర్వం రాజులు తమ వీరత్వం కోసం సైన్యంతో వెళ్లి ఆప్రాంతాన్ని జయించేవారు.ఒక గుర్రాన్ని వదిలి అది తిరిగే ప్రాంతంని ఆరాజు స్వాధీనం చేసుకునేవాడు.ఆగుర్రంని ఎవరైనా పట్టుకుంటే యుద్ధం చేసి విడిపించుకుని పోవాలి దాన్ని.దిగ్విజయం అంటే అర్థం ఏమంటే దిక్కుల్ని జయించటం అని.ఆరాజుని చక్రవర్తి సామ్రాట్ అని పిలిచేవారు.🌹
కామెంట్‌లు