కష్టేఫలి;- బల్ల కృష్ణవేణి-పలాస -శ్రీకాకుళం జిల్లా

 అనగనగా సిరిపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో బడి,గుడి తోటలు, పంట పొలాలు ఉన్నాయి. ఆ ఊరు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ బడిలో రామం అనే ఉపాధ్యాయుడు ఉన్నారు. అతనికి సీత అనే భార్య లవ,కుశ అనే పేర్లు గల ఇద్దరూ అబ్బాయిలు ఉన్నారు. లవ 9 వ తరగతి, కుశ 10 వ తరగతి చదువుతున్నారు. ఆ పిల్లలకి భార్య భర్తలు ఇద్దరూ రోజు తోట కి తీసుకు వెళ్లేవారు. ఆ తోటలో పక్షులు కిలకిల రావాలు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ తోటలో రామచిలుకలు అటు ఇటు ఎగురుతూ ఉంటే మనసుకి ఆనందంగా ఉంటుంది. లవ అనే వాడు బాగా చదివేవాడు. కుశ కి చదువు అంటే బద్ధకం ఆ కారణంగా 10వ తరగతి ఉత్తీర్ణుడు అవ్వలేదు. వీడికి బద్ధకం పోవాలంటే ఒక గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు ఉపాధ్యాయుడైన తండ్రి. వీళ్లు రోజు తోటకి వెళ్తుంటారు. ఒక రోజు తోట నుండి ఒక రామచిలుకను ఇంటికి తెచ్చారు. దానికి ఒక పంజరం ఏర్పాటు చేసి, దానికి గింజలు, పళ్ళు అన్ని ఆహారంగా పెడుతున్నారు. ఆ చిలుక కి చాలా బాగా చూసుకుంటున్నారు. ఆ చిలుకకి ఇక్కడ బాగా నచ్చింది ఎందుకంటే కావలసినంత తిండి దొరుకుతుంది. అదే తోటలో అయితే తిండి కోసం వెతుక్కోవాలి. ఇక్కడే బాగుంది అనుకుంది. ఎగరడం మానేసి అటు ఇటు తిరగడం మానేసింది. ఆ చిలుకకి అలా బద్ధకం చాలా ఎక్కువ అయింది. దాని పంజరం తలుపులు తీసిన ఎగరడం మానేసింది. అప్పుడు రామం ఆ చిలుకకు రెండు రోజులు ఆహారం పెట్టలేదు. దానికి ఆకలిగా ఉండీ, అటు గా రామచిలుకలు గుంపులు ఎగరడం చూసింది. ఒక్కసారిగా బద్ధకం వీడి పంజరం నుండి ఆహారం కోసం ఎగిరిపోయింది.ఉపాధ్యాయుడు తన అబ్బాయి అయినా కుశ కి ఈ చిలుక ఉదాహరణ గా బోధించాడు. అప్పటినుంచి కుశ మంచిగా చదువుకుని 10వ తరగతి ఉత్తీర్ణుడు అయ్యాడు.
 కథ సారాంశం: ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది.

*****

కామెంట్‌లు