పతనం(చిట్టి వ్యాసం); - :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పుట్టినవాడు గిట్టకమానడు నిజమే
కానీ, పుట్టీ పుట్టగానే మరణిస్తేనో?
వాడు దురదృష్టవంతుడు సుమా!
గెలుపు తలుపు తెరవని సమయంలో
ఏఆలోచన మొదలిడినా ఆగిపోవడమే.
ఏపని చేసినా నష్టమే. ఏకార్యమైనా ఫలితం దుఃఖభాజనమే. అది వాడి స్వీయ తప్పిదమా? లేక, వాడి దురదృష్టమా? మరి, వాడి గ్రహచార ఫలితమా? వాడు ఎన్నుకున్నది తప్పుడు మార్గమా? వాడి కృషి, ధైర్యం, పట్టుదల, తెలివితేటలు చూస్తుంటే వినీలాకాశంలో అంతులేని అవకాశాలతో దూరతీరాలకు ఎగిరిపోవాల్సింది. కాని, సూత్రంతెగిన గాలిపటంలా ఏ గహనాటవిలోనో చిక్కుకుని అగచాట్ల పాలవుతున్నాడు.
కాలం గాలానికి చిక్కి గాయాలపాలవడం అంటే జాతస్య ధృవమ్ పతనమ్ అన్నమాటేగా!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు