యోచించే! విషయాలు!!;- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
ఎగిరే పక్షికి దిగులుందా?
ఎగిసే అలలకు అలుపందా?
ఎందుకు మదిని దిగులు దండగ!
దాన్ని వీడిన రోజు పండుగ!

జారే నోరుకు విలువుందా?
కారే కుండకు నిలువుందా?
మాట తప్పని వాడు మాన్యుడు!
మడిమ తిప్పని వాడు శూరుడు

దున్నే రైతుకు దన్నుందా?
క్రుంగే మనసుకు దమ్ముందా?
సాహసమే కాదా  ఊపిరి!
మనోధైర్యమే సిరి చదువరి!

పొడిచే ప్రొద్దుకు అడ్డుందా?
నడిచే వారికి రోగముందా?
ప్రతిపనికీ ఫలితముండును!
చేసిన తప్పుకు శిక్ష ఉండును!


కామెంట్‌లు