గాంధారి.;- సేకరణ: ; డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 గాంధారదేశ రాజు సబలుడు ఇతనికి గాంధారి,తేజశ్రవ ,దశార్ణా , నికృతి,శుభ,సంభవ,సత్యవ్రత,సత్యసేన,సుశ్రవ,సుధేష్ణ, (ఈపేరు విరాటరాజు భార్యకు ఉంది.)శకుని మరికొందరు కుమారులు ఉన్నారు.సభలుడు తనకుమార్తెలు అందరిని దృతరాష్టుృనికి ఇచ్చి వివాహం జరిపించాడు.గతజన్నలో ధృతరాష్టుృడు'హంసుడు'అనే గంధర్వుడు.అతనితండ్రి 'అరిష్టుపుడు '
మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడి భార్య, కౌరవులకు తల్లి. ఇప్పుడు ఆప్ఘనిస్తానులో ఉన్న కాంధహార్ (పాతపేరు "గాంధార") నగరానికి చెందినది కావున ఈమెకు పేరు "గాంధారి" అని వచ్చింది. ధృతరాష్ట్రుడుతో వివాహ సంబంధం వచ్చిన వేంటనే గాంధారి ధృతరాష్ట్రుడిని పతిగా భావించి, తన భర్త గ్రుడ్డి వాడు అవడం చేత తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకొంది. ఈమెకు దుర్యోధనుడితో మొదలయ్యే నూరుగురు (కౌరవులు) కుమారులు, దుస్సల అనే కుమార్తె కలిగారు.
గాంధార రాజు సుబలుడికి, సుధర్మ కు గాంధారి జన్మించింది. మాతి అవతారంగా పరిగణించబడుతున్న గాంధారి తన ధర్మ స్వభావంతో పేరొందింది. హర్యానా ప్రాంతం ఢిల్లీలోని కురు రాజ్యానికి పెద్ద యువరాజు ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం ఏర్పాటు చేయబడింది. అందమైన, ధర్మవంతురాలైన స్త్రీగా, అంకితభావంతో ఉన్న భార్యగా మహాభారతంలో చిత్రీకరించబడింది. భీష్ముడు వివాహం జరిపించాడు. తన భర్త అంధుడిగా జన్మించాడని తెలుసుకున్నప్పుడు, ఆమె కూడా తన భర్తలా ఉండటానికి తన కళ్ళకు గంతలు కట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఒక అంధుడిని వివాహం చేసుకోవాలని తెలుసుకున్నప్పుడు గాంధారి మనసులో ఏముంది అనేది ఏ ఇతిహాసంలోనూ తనకు తాను కళ్ళకు గంతలు కట్టుకోవడం ప్రేమకు సంకేతంగా చిత్రీకరించబడింది.
వివాహానికి పూర్వం గాంధారి తపస్సు ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకొని 100 మంది పిల్లలను పుట్టడానికి వరం పొందిందని చెబుతారు. భీష్ముడు గాంధారిని కురు రాజ్యానికి పెద్ద కోడలిగా చేసుకోవడానికి ప్రధాన కారణాలలో ఈ వరం కూడా ఒక కారణం అని చెప్పబడింది. గాంధారపై హస్తినాపుర ఆక్రమణ యుద్ధంలో తన సోదరులందరూ చంపబడినందుకు కురు వంశంపై కోపం పెంచుకున్న శకుని కురు రాజవంశాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేశాడు. దాయాదుల మధ్య గొడవలు, యుద్ధాలు జరగడంలో కీలక పాత్ర పోషించాడు.
తన భర్త పట్ల గాంధారి భక్తిని చూసిన వేద వ్యాసుడు 100మంది కుమారులు పుట్టడానికి వరం ఇచ్చాడు. గాంధారి గర్భవతి అవుతుంది, కాని 2 సంవత్సరాలు అయినా కాని ప్రసవం కాదు. ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు భార్య కుంతి పాండవులలో పెద్దవాడికి జన్మనిచ్చిందని విన్న గాంధారి, నిరాశ నిస్సహాయతతో కడుపుపై కొట్టుకుంటుంది. ఫలితంగా బూడిదరంగులో ఒక ముద్ద పుడుతుంది. వేదవ్యాసడు దీనిని 101 భాగాలుగా విభజించి, మట్టికుండలలో నిల్వచేసి మరో 2 సంవత్సరాలు దాచిపెడతాడు. అలా గాంధారికి
దుర్యోధనుడు. 2. దుశ్సాసనుడు. 3. దుస్సహుడు. 4. దుశ్శలుడు. 5. జలసంధుడు. 6. సముడు. 7. సహుడు. 8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణుడు. 17. వివింశతుడు. 18. వికర్ణుడు. 19.శలుడు. 20. సత్వుడు. 21. సులోచనుడు. 22. చిత్రుడు. 23. ఉపచిత్రుడు. 24. చిత్రాక్షుడు. 25. చారుచిత్రుడు. 26. శరాసనుడు. 27. ధర్మధుడు. 28. దుర్విగాహుడు. 29. వివిత్సుడు. 30. వికటాననుడు. 31. నోర్ణనాభుడు. 32. నునాభుడు. 33. నందుడు. 34. ఉపనందుడు. 35. చిత్రాణుడు. 36. చిత్రవర్మ. 37. సువర్మ. 38. దుర్విమోచనుడు. 39. అయోబావుడు. 40. మహాబావుడు. 41. చిత్రాంగుడు. 42. చిత్రకుండలుడు. 43. భీమవేగుడు. 44. భీమలుడు. 45. బలాకుడు. 46. బలవర్థనుడు. 47. నోగ్రాయుధుడు. 48. సుషేణుడు. 49. కుండధారుడు. 50. మహోదరుడు.51. చిత్రాయుధుడు. 52. నిషింగుడు. 53. పాశుడు. 54. బృఎందారకుడు. 55. దృఢవర్మ. 56. దృఢక్షత్రుడు. 57. సోమకీర్తి. 58. అనూదరుడు. 59. దఢసంధుడు. 60. జరాసంధుడు. 61. సదుడు. 62. సువాగుడు. 63. ఉగ్రశ్రవుడు. 64. ఉగ్రసేనుడు. 65. సేనాని. 66. దుష్పరాజుడు. 67. అపరాజితుడు. 68. కుండశాయి. 69. విశాలాక్షుడు. 70. దురాధరుడు. 71. దుర్జయుడు. 72. దృఢహస్థుడు. 73. సుహస్తుడు. 74. వాయువేగుడు. 75. సువర్చుడు. 76. ఆదిత్యకేతుడు. 77. బహ్వాశి. 78. నాగదత్తుడు. 79. అగ్రయాయుడు 80. కవచుడు. 81. క్రధనుడు. 82. కుండినుడు. 83. ధనుర్ధరోగుడు. 84. భీమరధుడు. 85. వీరబాహుడు. 86. వలోలుడు. 87. రుద్రకర్ముడు. 88. దృణరదాశ్రుడు. 89.అదృష్యుడు. 90. కుండభేది. 91. విరావి. 92. ప్రమధుడు. 93. ప్రమాధి. 94. దీర్గరోముడు. 95. దీర్గబాహువు. 96.ఉడోరుడు. 97. కనకద్వజుడు. 98. ఉపాభయుడు. 99. కుండాశి. 100. విరజనుడు. 101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.
మొదటి కుమారుడు దుర్యోధనుని పుట్టినప్పుడు అనారోగ్య శకునాలు సంభవించడం చూసిన సత్యవతి, వ్యాసుడు, భీష్ముడు, విదురుడు మొదలగువారు పిల్లవాడు తమ రాజ్యానికి గొప్ప విధ్వంసం కలిగించవచ్చని ముందే తెలుసుకొని, ఆ పిల్లవాన్ని గంగానది నీటిలోకి పడేయడమో లేదా చంపడమో చేయాలని ధృతరాష్ట్ర దంపతులకు సలహా ఇచ్చారు. కాని వారు దానిని తిరస్కరించారు. చివరకు కురుక్షేత్ర సంగ్రామానికి కారకుడు అయ్యాడు.
 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం