ప్రాసాక్షరి- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
(తేటగీతి పద్యములు.)

చిచి. లిలి. పిపి. కక. నును. లులు.

 ఎం(చి )చూడగా ధర్మానికెవరు రక్ష?
మం(చి )తనమున కాతండు మారు పేరు
చి(లి)పి పనులను జేసెడి చిన్నవాడు
పి(లి)చి వేడిన భక్తుల వెతలు బాపు.

గో(పి)కావిభు నెల్లరు కొలుచు కొనగ
తీ(పి )పలుకుల రాయుడు తీర్చు దిగులు.
ప్రా(క)టంబగు వెల్గుతో ప్రజ్వలించి
శ్రీ(క)రంబుగ జనులకు శ్రేయమొసగు.

ము(ను)ల హృదయాల వసియించి ముక్తినిడును
ఘ(ను)డు సురలను గాచెడి కైటభారి
వి(లు)వ లెన్నియో బోధించి వెంట నడిచి
క(లు)షితంబులన్ బోద్రోలు కమల విభుడు.//

-------------------------------------------------------


కామెంట్‌లు