మనసున్న మారాజు *- వై నీరజారెడ్డి .--తెలుగు భాషో పాధ్యాయురాలు. జడ్పీహెచ్ఎస్, పన్యాల.
 పచ్చని పంట పొలాల్లోl తిరిగే మచ్చలేని చంద్రుడు మా రైతన్న .

 ఏరువాక పున్నం ఎదురుగా0గనే, దుక్కి కి నీళ్లేసి బురద పొలం దున్ని మురిసిపోతాడు .

నారు పోసింది మొదలు, నడక ఆగేది లేదు .కునుకు తీసేది లేదు .

ఎదుగుతున్న పైరును సూసుకుంటూ చంటి పాపల పానం పెట్టి సాకుతడు .

వాన వడక చేనుకు నీళ్లందకపోతే, శివుని గుళ్లో నీళ్లు వోస్తడు .
చీమలకు చెక్కరి వోస్తడు. 

ఆరుగాలాలు చేసిన కష్టం అడవుల పాలు కానియ్యకనీ కోటి దేవతలకు కొలువు వెడతడు .

రైతన్న బాధ చూసి బండరాళ్లే మూగవాయే. ఊరగాచే తల్లి ఉరిమి సూడంగనే * మనసున్న మారాజు *
వై నీరజారెడ్డి .
తెలుగు భాషో పాధ్యాయురాలు. జడ్పీహెచ్ఎస్, పన్యాల.

 పచ్చని పంట పొలాల్లోl తిరిగే మచ్చలేని చంద్రుడు మా రైతన్న .

 ఏరువాక పున్నం ఎదురుగా0గనే, దుక్కి కి నీళ్లేసి బురద పొలం దున్ని మురిసిపోతాడు .

నారు పోసింది మొదలు, నడక ఆగేది లేదు .కునుకు తీసేది లేదు .

ఎదుగుతున్న పైరును సూసుకుంటూ చంటి పాపల పానం పెట్టి సాకుతడు .

వాన వడక చేనుకు నీళ్లందకపోతే, శివుని గుళ్లో నీళ్లు వోస్తడు .
చీమలకు చెక్కరి వోస్తడు. 

ఆరుగాలాలు చేసిన కష్టం అడవుల పాలు కానియ్యకనీ కోటి దేవతలకు కొలువు వెడతడు .

రైతన్న బాధ చూసి బండరాళ్లే మూగవాయే. ఊరగాచే తల్లి ఉరిమి సూడంగనే ,తెల్లని మబ్బులు నల్లగా మారి, వానదేవుడు వచ్చి వాగు వంకలు నింపే. 

పారిన సేనుచూసి, ఆనందంతో వచ్చిన ,కళ్ళనీళ్ళను తుడుచుకొని హుషారుగా, చేతికర్ర   గిరగిరా తిప్పి, 

కూని రాగాలు తీస్తూ మురిపె0గా ముందుకు సాగే మన మనసున్న మా రాజు వానదేవుడు వచ్చి వాగు వంకలు నింపే. 

పారిన సేనుచూసి, ఆనందంతో వచ్చిన ,కళ్ళనీళ్ళను తుడుచుకొని హుషారుగా, చేతికర్ర   గిరగిరా తిప్పి, 

కూని రాగాలు తీస్తూ మురిపంగా ముందుకు సాగే మన మనసున్న మా రాజు

కామెంట్‌లు