నాడు - నేడు;-తెలంగాణా;- DR. అరుణకోదాటి- హైదరాబాద్
 నాడు  ఆచార వ్యవహారాలు, అణుకువ, ప్రేమాభిమానాలు, పెద్దలంటే గౌరవం, స్త్రీ లంటే మర్యాద,  అణకువ తో కూడిన సాoపప్రదాయము 
కలిగిన తెలంగాణా ప్రజలంటే
ఇతర రాష్ట్రాల వారికీ చేతకాని   తనం  అనిపిస్తే,
తెలంగాణా బాషా యాస అని హేళన చేసిన బాష ఇప్పుడు రాజబాష అయిoది.
నాగార్జున సాగర్  ఎడమ కాలువ విషయం లో తెలంగాణకు  అన్యాయం జరిగి నీళ్లు అందక  తెలంగాణా భూములు  బీడు భూములయి   కంపలు, చెట్లకు నిలయమైంది
పంటలు లేక  వందల ఎకరాలు  ఉన్నా  ఇంట్లో పస్తులే.
బయట కూలి చేయలేక,  ఇంట్లో ఉండలేక సంపాదనా మార్గం లేక
ఎన్నికుటుంబాలో  నరకం  చూసాయి.
కుటుంబ ప్రేమలు, బాధ్యతలు కలిగిన తెలంగాణా ప్రజలు  కేవలం  బ్రతుకు తెరువుకు దురాబారం  వెళ్లే పరిస్థితి  లేదు.
అది  బయటి వారికీ  తెలంగాణా ప్రజలంటే  బద్ధకస్తులు  పనిచేత కాదు అనే  పేరు పడిపోయింది
నేడు
తెలంగాణా వచ్చాక  తెలంగాణా  ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన  సంస్కరణలు,
నీటి పారుదల, చెరువుల
 త్రవ్వకాలతో   జలమయం అయి బీడు భూములు కాస్త పచ్చని   సస్య శ్యామలంతో  నిండిపోయాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ రాకతో   పొలాలన్ని కళకళ  లాడిపోతున్నాయి
రైతన్న  చేతినిండా  పని దొరుకుతుంది.
24 గంటల కరెంటు  రావడంతో  గ్రామాలన్నీ అంధకారం  వీడి  కాంతులు  వెదజల్లుతున్నాయి.
కర్శకులు  ఎప్పుడు వస్తుందో  తెలీని  కరెంట్  కొరకు  తెల్లవార్లు  నిద్రలేకుండా  పొలాల గట్ల కాపలా వుండి పాముకాట్లు,  చీకటిలో  కరెంట్ షాక్ల వల్లవచ్చేమరణాలు  తగ్గుముఖం  పట్టాయి.
కల్యాణ లక్ష్మి పథకంతో  ఎంతో మందికి కెసిఆర్ మేనమామాల  అండగా  నిలిచి  బేడా ఆడ పిల్లల  పెళ్లిళ్లు  అయ్యేలా  చేస్తున్నాడు.
అమ్మవడి  పథకం ప్రవేశ పెట్టి 
ప్రభుత్వ వాహనములో  తీసుకెళ్లి తల్లికి ఆరోగ్యవసతులు, బిడ్డకు కిట్టు,
అమ్మమ్మకు  చీరే కూడా పెట్టి  పంపిస్తు  తల్లిగారిల్లు  మరిపిస్తున్నది తెలంగాణాప్ర భుత్వం.
వితంతులకు ,, భర్త వదిలేసిన  స్త్రీ లకు నెల నెలా పెన్షన్ ఇస్తూ అన్నలా  అండగా  ఉంటున్నాడు
వికలాంగులకు అధిక మొత్తం పెన్షన్  అందిస్తూ  ఆపద్బాంద వుడిలా  కాపాడుతున్నాడు.
 రేషన్ కార్డు ల మీద  నిత్యావసరాలు అందిస్తూ  ఎన్నో  కుటుంబాలకు  ఆకలిని  తీరుస్తుంది తెలంగాణా ప్రభుత్వం.
ఐటీ హబ్  ఒక సంచలనమే 
ఎంతో మంది  నిరుద్యోగులకు  ఉద్యోగ  అవకాశాలు  కలిపించి 
ఇంటికొక  సాఫ్ట్వె్ర్ అవడంతో 
కుటుంబాలన్నీ  ఆర్థిక బాధలేకుండా  ఆడంబరంగా  జీవిస్తున్నాయి.
 60  సంవత్సరాములు దాటిన  వృద్దులకు  తక్కువ రేటుతో ప్రయాణ సౌకర్యాలు,
ఆరోగ్య వసతులు, పెన్షన్లు ఇస్తూ మరీ  బిడ్డలా  చూసుకుంటుంది  తెలంగాణా ప్రభుత్వం.
చారిత్రక కట్టడాలు, పురాతన  ఆలయాల  పునరనిర్మాణం  చేపట్టి   పూర్వ వైభవన్నీ  తెచ్చింది
అసెంబ్లీ, సెక్రటేరియట్,  అమరుల  స్తూపం   ఆధునిక పునరనిర్మాణం  చేపట్టి   తెలంగాణా మీద  తనకున్న  అభిమానం  చాటుకున్నది  తెలంగాణా ప్రభుత్వం.
జై  తెలంగాణా, జై జై  తెలంగాణా


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం