అక్షర సేద్యం కవితల పోటీ-2023 ఫలితాలు విడుదల
 సామాజిక చైతన్య స్ఫూర్తి కలిగించేలా సిద్దిపేట కు చెందిన అక్షర సేద్యం ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీకి అనూహ్య స్పందన వచ్చింది.ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి మొత్తం 286 కవితలు రాగా,అందులో నుండి 8 ఉత్తమ కవితలను ప్రముఖ కవి,మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ డా.ఏనుగు నరసింహ రెడ్డి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ఎంపిక చేసారని  అక్షర సేద్యం ఫౌండేషన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు భైతి దుర్గయ్య,వేల్పుల రాజు మంగళ వారం సిద్దిపేటలో కవితల పోటీ ఫలితాలను విడుదల చేసారు. 
బహుమతుల వివరాలు :
. ప్రథమ బహుమతి : 2000 /- మనిషి జాడ : పెనుగొండ బసవేశ్వర్  కరీంనగర్ ,ద్వితీయ బహుమతి : 1500 /-పశువు : చిందం రమేష్ జగిత్యాల ,తృతీయ బహుమతి 1000 /- కొత్తగా చిగురించాలి : డా || మల్లిపూడి రవిచంద్ర, హైద్రాబాద్  ప్రత్యేక బహుమతులు - ( 500 / - నగదు చొప్పున ) 1 ) పని దేవత : చింతా అప్పలనాయుడు పార్వతీపురం , మన్యం జిల్లా2 ) ఖాళీ మనుషులు కళా గోపాల్ నిజామాబాద్ - 3 ) నన్ను నన్నులా : డి . నాగజ్యోతి శేఖర్ - ఐ పోలవరం , తూర్పుగోదావరి జిల్లా .4 ) ఎన్నాళ్ళుంటారు రోడ్ల మీద డా || జడా సుబ్బారావు - నూజివీడు , ఏలూరు జిల్లా . 5 ) అవిభాజ్య దుఃఖం - లేదాళ్ళ రాజేశ్వరరావు - లక్సెట్టిపేట .

ఈ ఎనిమిది కవితలతో పాటు మరో 26 కవితలు ఎంపిక చేసి కవితా సంకలనం రూపొందిస్తామని,బహుమతి ప్రదానము రోజున పుస్తకావిష్కరణ చేస్తామని అక్షర సేద్యం ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.


/- వేల్పుల రాజు
ప్రధాన కార్యదర్శి
అక్షర సేద్యం ఫౌండేషన్
9701933704


కామెంట్‌లు