కాశ్మీరం నా శిరస్సు
హస్తిన నా హృదయం
రాష్ట్రాలనీ నా అంగాలే
నేనే నా దేశం..
ఆసేతు హిమాచలం
అఖండ భారతం నేనే నేనే..
కర్మ భూమి నా దేశం
పుణ్య భూమి నా దేశం
ధర్మ భూమి నా దేశం
వేద భూమి నా దేశం..
నా దేశం భాగ్యోదయ దేశం
నా దేశం కరుణాంతరంగ
నా దేశం విశ్వ గురు
నా దేశం మహోన్నత శిఖరం..
నా దేశం వేదాలకు పుట్టినిల్లు
నా దేశం దేవతలకు ఆలవాలం
నా దేశం ఋషి పుంగవులకు నిలయం
నా దేశం సంస్కృతి సంప్రదాయలకు నెలవు..
నాదేశం ఎందరో మహానుభావులకు కు జన్మ ప్రదేశం
నా దేశం ఎందరో పుణ్య మూర్తులకు కొలువైన దేశం ..
నా దేశం దేశభక్తుల సామ్రాజ్యం
మతాలు వేరైనా
ప్రాంతాలు వేరైనా
రాష్ట్రాలు వేరైనా..
భాషలు వేరైనా.
యాసలు వేరైనా
కాశ్మీరం మొదలు
కన్యా కుమారి ఆగ్రం వరకు
అందరం ఆన్న దమ్ముల్లా నివసిస్తాం
మేమంతా భారతీయులం
భరత మాత ముద్దు బిడ్డలం.
ఆపదలో ఆదుకునే అలీన దేశం..
అన్నా అంటే నేనున్నా అనే దేశం
అయ్యా అంటే అభయ హస్తం ఇచ్చే దేశం
అమ్మా అంటే కడుపు నింపే దేశం..
అగ్ర దేశం అయిన అల్ప దేశం అయినా
కయ్యానికి కాలు దువ్వని
శాంతి కాముక దేశం..నా దేశం
అంతే కానీ,
నా దేశం పై ఈగ వాలినా సహించం
నా దేశం పై కన్ను వేసినా సహించం
నా దేశంలో దొడ్డి దారిలో నక్కినా సహించం.
నా దేశం లో అలజడి సృష్టించినా సహించం.
నా దేశానికి హాని చేస్తే చీల్చి చీల్చి చెండాడుతాం..
మా గీతం జన గణ మన
మా పంతం దేశ సౌభాగ్యం.
మా సొంతం ఆఖండ భారతం
మా మతం భారతీయం..
మా తరం వందే మాతరం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి