మూడు కన్నుల ముక్కంటి మా దైవం
కోరిన వరాలను ఇస్తాడులే తను వైనం
మూడు లోకాలను ఏలేటి ఓ మా ముక్కంటి
చేతులెత్తి నే ప్రతినిత్యం మొక్కుతుంటి !
అడిగిన వెంటనే ఇస్తావు కోరిన వరాలు
అందుకే నీకు అంతులేని గుడి గోపురాలు
వాటిని నిర్మించి పూజించే నీ ప్రియ భక్తులు
వారి పాపకూపం నుండి అవుతారు విముక్తులు!
నిన్ను పూజించే భక్తులకు నీడనిస్తావు
వారి మెడలోన వరమాలను వేస్తావు
దేవుడున్నాడన్న విశ్వాసం కలిగిస్తవు
వారు కోరిన భోగభాగ్యాలను అందిస్తావు !
అందుకే అన్నారు భోళాశంకరుడని నిన్ను
పాపుల పాలిటి యమపాశం నీమూడోకన్ను
పుణ్యాత్ములకు చూపిస్తుందిలే అది దారీ తెన్ను
పాపం పాపాత్ములకు ఇకమిగిలేది నోట్లో మన్ను !
నీవు నివసించేది హిమాలయ పర్వతాల్లో
మేం ఉపాశించేది నిర్మించిన మా దేవాలయాల్లో
మా పూజలందుకొని ఔతావులే ప్రత్యక్షం
నీ మూడోకంటిలోని మా ద్రుశ్యాలే సాక్ష్యం !
పూసుకున్న బూడిదే నీ ఒంటికి అందం
గౌరీదేవితో ఉందిలే నీకు ముడివేసిన బందం
పార్వతీదేవితో నీపరిణయం ఎంతోఅందచందం
ఈ ఆది దంపతుల గూర్చి వ్రాయొచ్చు ఓపెద్ద గ్రంధం !
నీ ఒంటికి పాములే అందమైన నగలు
నీకు ఎవరిపైనా ఉండవులే పగలు సెగలు
నీ మొలకు చుట్టుకుంటావు పులితోలు
ఆ గంగమ్మ తల్లిని కానివ్వవు నేలపాలు!
మామ పర్వతరాజుతో పెట్టుకున్నావు కలహం
వీరభద్ర అవతారమెత్తి సృష్టించావుకోలాహలం
నీ సతి పార్వతీదేవి చేసెనుగా శపథం
నీ వప్పుడు చూపించావులే నీ ప్రతాపం !
ముక్కంటి అన్నందుకు నను మన్నించు
ముప్పొద్దుల నీ దీవెనలను ఇక అందించు
పాపాలను రూపుమాపు దీపాలను ముట్టించు
చీకట్లను తొలగించి వెలుగు దివ్వెల పెట్టించు!
ఓ ముక్కంటి అందమైన కలనే నేగంటి
ఆ అద్భుతమైన కలలో నిన్నే చూస్తుంటి
నన్ను ఆదరించి నీ అక్కున చేర్చుకున్నవు
సదా నీ భక్తునిగా నన్ను మార్చుకున్నవు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి