ఈ షణత్రయం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి మనిషి దేనికో ఒక దానికి తాపత్రయపడుతూనే ఉంటాడు  ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలన్న తపన పెరుగుతుంది దానికోసం  అనేక పక్కదారులకు వెళ్లి  ఎన్ని ఇబ్బందులు పడిన దానిని సాధించాలని  కోరుకుంటాడు  ఇవాళ ప్రపంచాన్ని శాసించేది డబ్బు  డబ్బు లేని వాడు దుబ్బుకు కొరగాడు అని ఒక సామెత  చేతిలో  డబ్బు ఉంటే కొండమీద కోతిని కూడాతన ఇంటి గుమ్మం ముందు కట్టి వేయగలరు  దానిపై విపరీతమైన మోజు పెరిగి కాంక్ష  తీరక  దాని కోసమే ప్రయత్నం చేసే వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం  నాకు ఈ ధనం చాలు ఇంకా అవసరం లేదు అనే వ్యక్తులను మనం ఎవరినైనా  మచ్చుకు ఒకరిద్దరునైనా చూపగలమా  అది జరగని పని అంటాడు వేమన. జీవితంలో ప్రతి వ్యక్తి తన తోడు కోసం ప్రయత్నం చేసి  తన కుటుంబానికి అవసరమైన భార్యను పొంది  ఆమె ద్వారా సంతానాన్ని  వ్యాప్తి చేసి వారి మీద  వ్యామోహాన్ని పెంచుకుంటాడు  భార్యను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు రా వాడు  అని మనవాళ్లు ఎద్దేవా చేస్తున్న సంఘటనలు కూడా  మనకు తెలుసు  అలా చేస్తున్న సమయంలో ఆమె దానిని ఆధారం చేసుకుని  అతనిని  ఆవులు చెప్పినట్టు నడిచేలా చేసుకుంటుంది  అది ఆమె మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది  ఇలా భార్యపై మమకారాన్ని పెంచుకున్న వ్యక్తి  ఆమె సుఖం కోసం  ఆమెకు కావలసిన చీరలు వస్తువులు బంగారపు వస్తువులు  అన్ని  తీసుకురావడానికి కూడా వెనుకాడడు  కనక ఇది అతనికి రెండవ బలహీనత  ఇంక మూడవ దానికొస్తే
వివాహం అయిన తర్వాత ఒక పుత్రుడు జన్మిస్తే  ఆ బిడ్డ పైన పంచప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతాడు  దానికి కారణం పున్నామ నరకం నుంచి తనను తప్పించేటువంటి వాడు వాడే  అని మన పెద్దల నమ్మకం  ధనం పైన భార్య పైన బిడ్డల పైన ఉన్న  మమకారాన్ని  చెప్పడం కోసం వేమన వాడిన శబ్దం ఈ క్షణత్రయం ఈ మూటి మీదే వ్యామోహాన్ని పెంచుకున్న వాడికి  అతని జన్మలో మోక్షం వస్తుందా అని వేమన ప్రశ్నిస్తున్నాడు  ఈ మమకారాలు ఆప్యాయతలను  వదిలివేసి  ప్రత్యేకించి స్త్రీ వివాహం నరకానికి తీసుకువెళ్లే మార్గం  వాటిని వదిలి మనసులు శుద్ధి చేసుకుని భగవంతునిపై మనసును లగ్నం చేస్తే అతనికి మోక్షం రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ జన్మలో అతనికి రాదు  అంటున్నాడు వేమన ఆ పద్యాన్ని చదవండి.
"ఈ షణత్రయంబునెడ పండనేరక మోహరాసిలోన మునిగియుండు జనుల కెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా..."


కామెంట్‌లు