భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి, వాటిపట్ల నేటి యువతకు ఒక అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం చేపట్టిన ‘కుటుంబ ప్రబోధన్’ అనే వినూత్న కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై వుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిని ఒక స్వంచంధ సేవా సంస్థ నిర్వహించనుంది.
కనీసం వారానికి ఒక రోజు అయినా కుటుంబ సభ్యులు అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ‘వసుధైక కుటుంబం’ అనేది భారతీయ సంస్కృతి ముఖ్య లక్షణం. ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచం కారణంగా వసుధైక కుటుంబం మాట దేవుడెరుగు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. దీని కారణంగా సమాజంలో నైతిక విలువలు, మానవీయత క్రమక్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాల నుండి న్యూక్లియర్ కుటుంబాల వ్యవస్థకు మన కుటుంబ వ్యవస్థ పతనమైపోయింది. మరొక పక్క దేశంలో వయోవృద్ధుల ఆశ్రమాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తమ పిల్లలు ఏమి చేస్తున్నారో కూడా గమనించని తల్లిదండ్రుల సంఖ్య కూడా బిజి బిజి లైఫ్ కారణంగా బాగా పెరిగిపోయింది. కుటుంబ సభ్యులు అందరూ స్మార్ట్ ఫోన్లు, టీవీలకు దూరంగా వుండి కనీసం వారానికి ఒకసారి కలిసి భోజనం చేయడం వలన వారిమధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. పిల్లల్లో చిరుప్రాయంలోనే ‘ఇది తమ కుటుంబం’ అనే భావన ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు అందరూ మనసు విప్పి మాట్లాడుకోవడం వలన, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది అని ఈ సంస్థ భావిస్తోంది.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం వల్ల పెద్ద నగరాల్లోని కుటుంబాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని, అయితే గ్రామాలు ఇప్పటికీ "ఆధునిక సంస్కృతి యొక్క ఈ ప్రతికూల అభివృద్ధి" నుండి విముక్తి పొందాయనితెలుస్తోంది. గ్రామాల్లో 'చౌపల్స్' ఉండటం ఇప్పటికీ గ్రామీణ కుటుంబాలకు ఒకచోట చేరి సమస్యలను చర్చించడానికి వేదికగా నిలుస్తుందని ఈ సంస్థ భావిస్తోంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి