* చిత్రకవిత *" @ బహుమతి.... ! ";- కోరాడ నరసింహా రావు.
ఆదేవుడు నీకిచ్చే మొదటి బహుమతి నిన్నుగన్న తల్లయితే.., ఆ రెండవ బహు మతి నీ తండ్రియే... !

భుజానికెక్కించుకు తిరగటం 
కన్నబిడ్డపై మమకారం... !
  ఇది కేవల అనురాగం... 
ఇలా ప్రేమగా పెంచటం... !!

తల్లిగర్భమున బిడ్డ... 
  రూపుగట్టింది మొదలు... 
  అపురూపంగా చూసుకునే 
     దక్షుడు నాన్నే కదా మరి !

తనకాళ్లపై తను నిలిచేదాకా 
   తండ్రి కాళ్లపై ముందుకుసాగి 
   ప్రయోజకులమౌదుము కాదా
 ఈ ప్రతిబింబమునకు బింబము తండ్రే కదా

పెరిగి పెద్దయిన మనము.... 
  నేడు నిన్ను చూసుకున్నట్టే 
   రేపు నీతండ్రినీ నువ్ చూసు కొనుటయే,
నీతండ్రికి నువ్విచ్చే బహుమానం.... !
        *******

కామెంట్‌లు