నానుడికథ ౼ డా.దార్ల బుజ్జిబాబు
 రామబాణం
     తిరుగులేని అస్త్రం అనే అర్థం చూచించటానికి  రామబాణం అనే నానుడి వాడడం రివాజు. వాడి మాట 'రామబాణం' అని అంటూ ఉంటారు. అంటే వాడు చెప్పే మాట తిరుగులేనిది అని, వెనక్కు తీసుకోవటానికి వీలులేనది అని అర్ధం. ఈ రామబాణం అనే నానుడి రామాయణం కథ నుండి వచ్చిందని వేరే చెప్పనవసరం లేదు.
   రాముడు సీత జాడ తెలుసుకుంటాడు. లంకలో ఉందని హనుమంతుడు స్వయంగా చూసి వచ్చి చెపుతాడు. లంకలోకి వెళ్లాలంటే సముద్రంలో నుండి వెళ్ళాలి. సముద్రం దాటడం ఎలా? అదే ఇప్పుడు రాముని మదిలో ఉన్న పెద్ద సమస్య.  వెంటనే   రాముడు దారి ఇవ్వమని సముద్రుడిని  బ్రతిమిలాడి అడుగుతాడు. "ఇది లోక విరుద్ధం. సముద్రం సముద్రం లానే ఉండాలి, దారి ఇవ్వవడం సాధ్యం కాదు" అని శ్రీరామునికే  నీతులు చెప్పాడు సముద్రుడు.  సముద్రుడు ఎవరో కాదు. రఘువంశపు వాడే.  రామునికి పూర్వీకుడు. సగరుని అరవై వేల మంది సంతానమే సముద్రం. రామునికి కోపం వచ్చింది.  "నీవు నీలా ఉండాలంటే కుదరదు. అవసరాన్ని బట్టి మార్పు  చెందాలి. పరోపకారి వైన నీవే ఇలా అంటే ఎలా? మార్గం ఏర్పాటు చేయి? అన్నాడు రాముడు. సముద్రుడు కుదరదంటే కుదరదు అన్నాడు. ఇక లాభం లేదని  రాముడు రామబాణం తీసి సముద్రుని వైపు ఎక్కుపెట్టాడు. ప్రకృతి ప్రళయ ఘర్జన చేసింది. సూర్యచంద్రులు లయ తప్పారు. భూగోళం గడగడా వణక సాగింది. సముద్రుడికి ముచ్చెమటలు పట్టాయి. సముద్రుడు రాముడి పాదాల వద్ద సాగిల పడ్డాడు. "అయ్యా నీ బాణం తగిలితే నేను పూర్తిగా భస్మం అవుతాను. చుక్క నీరు లేకుండా ఎండిపోతాను. ఇసుక రేణువులులాగా మిగిలి పోతాను. నీ బాణానికి ఉన్న శక్తి ఎరుగక విచక్షణ రహితంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. మీ వానర సేనలో నలుడు అనే విశ్వకర్మ పుత్రుడు వున్నాడు. అతడిచే నాపై వారధి నిర్మించండి" అని సలహా ఇచ్చాడు. రాముడు శాంతించాడు.  ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఎక్కుపెట్టిన బాణం వృధాకారదు. దాన్ని ఏమిచెయ్యాలి? ఆలోచిస్తూ ఉండగా సముద్రుడు అందుకుని "అయ్యా! శ్రీరామా!!  తూర్పువైపున పాపాత్ములు, లోకకంఠకులు వున్నారు. వారిని సంహరించండి" అన్నాడు. అలా తన రామబాణంతో లోక విరోధులను చంపాడు. 
     ఇప్పుడు తెలిసింది కదా రామబాణం శక్తి. దాన్ని ప్రయోగిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో?  అందుకే రామబాణం నానుడి కూడా ఇలాంటి సందర్భాలలోనే వాడతారు.  ఎక్కుపెట్టనే కూడదు. ఎక్కుపెడితే ఏదో ఒక అనర్ధం తప్పదు అనే అర్ధంతో ఈ నానుడిని ఉపయోగిస్తూ ఉంటారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం
భళిరే నైరా
చిత్రం