గాలిలా రమ్మంది!!!; - ప్రతాప్ కౌటిళ్యా
జారుతున్న కాలం నీటిలాపారుతూ
ఎత్తు పల్లాలను చదును చేస్తోంది!!
రేపటి ముత్యాల పంటకు
మట్టిని శుద్ధి చేస్తుంది.................!!

కొలిమిలో ఎర్రగా కాల్చి సుత్తితో బాదుతున్న
కాలాన్ని
చెట్లు నాటటానికి కానీ నరకడానికి
గొడ్డలిని సిద్ధం చేయట్లేదు................!!

కన్నీరు కారుస్తున్న కాలం మూసలో కదులుతున్న బంగారు ఆభరణంలా
మెరుస్తోంది...................................!!

నదుల్లాపారి సగం సగం నరికి వేయబడ్డ ఇంకా కదులుతున్న కాలం
జీవితకాలం చిలుక జ్యోతిష్యంతో ఎక్కడో మర్రిచెట్టు తొర్రలో మాయల పకీరు ప్రాణంలా ఉంది................................!!

పక్షులను బంధించే వేటగాని చూపు కాలంవైపు మళ్ళింది
చేపలవలలో ఎగిరిపడే చేపల్లా కాలం ఇప్పుడిప్పుడే పట్టుకోల్పోతుంది.............!!

ఆనకట్టలో బంధించిన జలంలా జాలిగా చూస్తున్న కాలాన్ని
కట్టిపడేసినట్లు కాలం తెలుసుకుందీ..........!

అలలు కనే సముద్రంలా కలలు కనడం మొదలుపెట్టిన కాలం మేల్కొంది ఇప్పుడే!!

నిశ్శబ్దంగా ఆక్రమించిన చీకటి నిదురపోని పొద్దును ఇప్పుడిప్పుడే కదుపుతుంది.......!

చల్లగా వీచే పిల్లగాలి తాగితేనే తల్లడిల్లిన పైరు కాస్త కాలాన్ని నిలదీసి
చెట్లకు వేలాడేసింది దిష్టిబొమ్మల్లా.............!

ఎక్కడ చూసినా పచ్చగా కనిపించే దంతా భూమని తెలుసుకున్న కాలం
ఇంకా తప్పించుకోలేనని తెలుసుకుంది......!

నీలి ఆకాశంలోంచి రాలి పడుతున్న ఒక్కో చినుకు ఏరుకుని
మూటగట్టుకుని ముందుకు సాగింది కాలం!!

రేపటికల్లా మొలుస్తున్న మొలకలు నక్షత్రాల్లా మెరిసిపోతున్న కాలం నెత్తిమీద
సూర్యుడు హత్య చేయబడ్డట్లు తెలుసుకుంది......................................!!

శాశ్వతత్వం కోల్పోయిన కాలం కల్లు పోగొట్టుకుంది
అంతా అంధకారం ఎన్ని వింతలుంటే నేమి
ఎన్ని అద్భుతాలు జరిగితే నేమి
శిలగా మారి నిలబడింది........................!!

చుట్టూ ఏం జరుగుతుందో చెప్పే వీచే గాలి తప్ప సమస్త లోకాలు విశ్రాంతి లేకుండా ఉన్నాయి...........................................!!

నిప్పు పెట్టిన కాలిపోని కాలం మెల్లిగా కరిగిపోతుంది......................................!

ప్రాణం విలువ తెలిసి పట్టుబట్టి మట్టిని ప్రేమించింది........................................!!

వదిలిపెట్టి పోలేని కాలాన్ని మట్టి ఈసారి
నీరులా కాక చల్లని గాలిలా రమ్మంది......!!
కొట్టుకునే గుండెల్లో దాగి పొమ్మంది.........!!

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273/20-07-2023

కామెంట్‌లు