కన్నీటి వరదలకు
కరకట్ట కట్టేటి
కనులకు కళ నిచ్చు
కమనీయమైన ఉదయంలా
కలతల్ని తరిమేసి
కలలన్ని ఒక్కసారి
కమ్మగా దోసిట్లో
పోసి తీసుకొమ్మనే వేకువలా
వేదనల వెతలన్నీ
మరపించి మురిపించి
వేడుకగ కాలాన్ని
నడిపించు తొలిసంధ్యలా
చింతలన్ని తొలగించి
చిక్కుముడులు తీసి
చిట్టి పొట్టి ఆశలను
చక్కగా తీర్చేసే మేలిపొద్దులా
భ్రాంతులు తొలగించి
కాంతులు వెలిగింప
కోటి ప్రభల వెలుతురు
మోసుకొచ్చు తొలిపొద్దులా
చిరునవ్వుల తొలకరిగా
నవ్వుపువ్వుల వసంతంలా
గుండెకొచ్చిన పండుగై
నిండుగ తోచే ప్రభాతంలా
ఆగమించు ఆదిత్యుని
స్వాగతించు కోరికతో
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి