సకలసృష్టినీ ప్రాణవంతంచేసే ఆ తేజోమూర్తి మరో రోజును ప్రారంభించాడు. అద్భుత సౌందర్యంతో దీపించే సూర్యోదయాన్ని చూశా.
కనుచూపుమేరంతా పసిడిరజనుతో కప్పేసినట్లుంది. కాంతికిరణం చెరువులోని పసిడిజలాలపై ఉయ్యాల లూగుతోంది. భూమిపైనుండి అల్లంతఎత్తున ఎదిగి ఆకాశంలోకి గర్వంగా చూస్తున్న పర్వతాలు తలవంచి తమ అందాలను చెరువు అద్దంలో చూసుకుంటున్నాయి. భువి సుకోమల హరితపరిధానంతో రమణీయంగా వయ్యారాలుపోతోంది. అమరవర్ణాల్లో మనోహరంగా శ్రేణీబధ్ధమై మోహరించి
ఆహ్లాదపరిచేపుష్పాల అపురూప పరీమళంతో నిండిన ఆ పరిసరాలు అపూర్వ మధురిమనందించే కల కూజితాలు, అందమైన జంతు కలరవాలు అబ్బ! ఈభువిపై సజీవస్వర్గం అంటే ఇదేనేమో! అక్కడ నా నగ్నపాదాలతో నడుస్తూ ప్రకృతి విన్యాసాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నా!
ఇంతలో....శ్....శ్....శ్....శ్....శ్....!
మా కిచెన్ నుంచి కుక్కర్ విజిల్ శబ్దం
అంటే?!..... ఇదంతా నా కలల ప్రపంచంలో విహరించడమేనా?!
హతవిధీ! హు! హు! హు! హు!!!!
+++++++++++++++++++++++++
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి