సుప్రభాత కవిత ; -బృంద
చీకటికీ వెలుతురుకీ
మధ్య ఒక వెలుగు కిరణం
వేడుకకూ వేదనకూ
మధ్య ఒకే ఒక క్షణం..

మనసుకు ఎంతో ఓదార్పు
తెస్తుందని మంచి మార్పు
ఆశల ముత్యాల కూర్పు
అలసిపోనివ్వని ఓర్పు...

రేపెంతో గొప్పదని
మాపటినుండీ ఎదురుచూపు
ఎదరంతా వెలుగేనని
ఉషోదయం కోసం మైమరపు

ఆణిముత్యాల మూటలు
మరకతమణుల పేటలు
మేలిమి రత్నంలాటి క్షణాలు
తెస్తుందని బంగారుకలలు

ఆశలు అంతరాలు
ఊహలు ఉత్సవాలు
కోరికలూ కొత్తజీవితాలు
ఏవీ తెలియకనే విరిసిన సుమాలు

మురిసే ఆనందాలు
పరిచే కాంతులు
పంచే పరిమళాలు
ప్రకృతిలో మమేకమే!

చిన్నిదైతేనేం విలువైన జీవితం
ఉన్న కాసేపూ  ఆనందమే!
చూసే ప్రతి మనసుకూ
ఎనలేని  ఆహ్లాదమే!

జీవనయానంలో మరో మజిలీకి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు