ఒక వృద్ధ రైతు జైలులో ఉన్న తన కుమారుడికి ఓ ఉత్తరంలో ఇలా రాశాడు...
"ఒరేయ్ అబ్బాయ్! ఈ సంవత్సరం నేను బంగాళాదుంపలు వేయలేను. ఎందుకంటే నేను ఒంటరిగా పొలాన్ని తవ్వలేను. నువ్విక్కడ ఉండి ఉంటే నాకు సహాయం చేసేవాడివి. కానీ నువ్విక్కడ లేకపోవడంతో నేనొక్కడినే ఆ పని చేయలేను"
తండ్రి ఉత్తరానికి కొడుకు ఇలా ప్రత్యుత్తరం రాశాడు...
"నాన్నా, పొలం తవ్వాలని ఆలోచించకు. ఎందుకంటే నేను దొంగిలించిన డబ్బునంతా అక్కడే పాతిపెట్టాను" అని.
అయితే పోలీసులు ఈ ఉత్తరాన్ని చదవడంతోనే మరుసటి రోజు అక్కడికి వెళ్ళి డబ్బు కోసం పొలం తవ్వారు. కానీ వారికేమీ దొరకలేదు.
రెండోరోజు ఆ కొడుకు తన తండ్రికి మళ్లీ ఇలా రాశాడు....
'ఇప్పుడు మీరు బంగాళాదుంపలు నాటండి నాన్నా. నేను జైల్లో నుంచి మీకు చేయగలిగింది ఇదే' అని.
ఈ చిట్టి కథ చెప్పే మాటొకటి...
మనల్నెవరైనా శారీరకంగా శిక్షించొచ్చు కానీ మన ఆలోచనాసరళినో లేదా తెలివితేటలనో ఎవరూ ఎన్నటికీ ఏమీ చేయలేరు.
- ఇంగ్లీషులో చదివాను. రాసినవారి పేరు తెలీలేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి