న్యాయాలు -206
మేష యుద్ధ న్యాయము
*****
మేషము అంటే మేక పొట్టేలు మేషరాశి అనే అర్థాలు కలవు.
యుద్ధం అంటే పోరు,గ్రహ విరోధము,పోట్లాట,సమరము, రణం,కయ్యము అనే అర్థాలు ఉన్నాయి.
పొట్టేలు పొట్టేలు నడుమ నక్కపడి చచ్చినట్లు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఎవరైనా ఇరువురు కానీ, ఇరువర్గాలు కానీ తీవ్రంగా పోట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళ పోట్లాటను ఆపాలనీ చూసినా,అందులో తనకేదైనా లాభం కలుగుతుందేమోనని ఆశ పడినా చివరికి ప్రాణాలకే ముప్పు వస్తుందని ఈ "మేష యుద్ధ న్యాయము" చెప్పి హెచ్చరిస్తుంటారు.
పొట్టేళ్ల పోట్లాట మామూలుగా ఉండదు. రక్తాలు కళ్ళజూసుకుంటాయి. ఈ పోట్లాటలో ప్రాణాలను సైతం పోగొట్టుకుంటాయి. అంత తీవ్రంగా ఉంటుంది వాటి పోట్లాట.
ఒకసారి బాగా బలంగా ఉన్న రెండు పొట్టేళ్ళకు పోట్లాట వచ్చింది. అవి హోరాహోరీగా పోట్లాడుకోవడం మొదలు పెట్టాయి. ఆ పోట్లాటలో వాటి తలలు పగిలి రక్తం నేల మీద పడి గడ్డకట్టింది. దూరం నుంచి ఓ నక్క ఇదంతా చూసింది. వాటి రక్తం చూడగానే దానికి నోరూరింది. మనసులో అవి చచ్చిపోతే తాను ఆహారం వెతుక్కునే పనిలేదని సంబరపడింది.
అంతటితో ఆగితే బాగుండేది. ఈ లోపు కిందపడిన రక్తాన్ని నాకేద్దాం అనే దురాశ దానిలో పుట్టింది.
పొట్టేళ్ళ పోట్లాట ఎలా వుంటుందంటే వెనక్కి కొంత దూరం పోయి వేగంగా ఉరికొచ్చి తలలతో ఢీ కొంటాయి.
అవి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఢీకొనేలోగా ఆ రక్తాన్ని నాకేయాలనే ఆశతో వెళ్ళి నాకుతుండగా వేగంగా వచ్చి ఢీకొట్టుకున్న పొట్టేళ్ల మధ్య ఇరుక్కుపోయి, వాటి తలల తాకిడికి నలిగి చచ్చిపోయింది.
కాబట్టి ఇతరుల గొడవల్లో తలదూర్చి స్వలాభం కోసం ఆశపడినా,ఆ ఇద్దరి క్షేమం కోసం ఆరాటపడినా చివరికి నష్ట పోయేది మూడో వ్యక్తే అని ఈ "మేష యుద్ధ న్యాయము" ద్వారా తెలుసుకోవచ్చు.
ఇంకా కొన్ని సందర్భాల్లోనైతే "మేం మేం తన్నుకుంటాం. సవాలక్ష అనుకుంటాం. కలిసి పోతాం. మధ్యలో నువ్వెవరని శాంతింప చేయడానికి వచ్చిన వ్యక్తులపై విరుచుకుపడటం మనం చూస్తూనే ఉంటాము.
కాబట్టి ఇలా మూర్ఖంగా పోట్లాడుకునే వారి మధ్యకు పోనూ పోవద్దు. అనవసరమైన హానిని కొని తెచ్చుకోనూ వద్దని ఈ న్యాయము ద్వారా గ్రహించి జాగ్రత్తగా ఉండాలి.అంతే కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి