ఉదయం పది గంటలవుతుంది.టిఫిన్, వంటపని , అంతా అయిపోయింది. శ్రీ వారికీ పిల్లలకు లంచ్ బాక్స్ లు పట్టుకెళ్లారు.
ఏంటబ్బా ఇంకా పనిమనిషి రాలేదు? అనుకుంటూ బాల్కనీలోకి వెళ్లి నిల్చున్నా.
యదాలాపంగా ఎదురింటి ఫ్లాట్ వేపు చూసా. అవునూ... ఈ రోజు ఇంతవరకు ఆ అమ్మాయి, బయటకు రాలేదు? ఇదివరకల్లా తన భర్త ఆఫీసుకు ఆఫీసుకు వెళ్తుంటే పక్కనే ఉన్న లిఫ్ట్ వరకు పంపి నాతో మాట్లాడుతున్నా కూర్చునేది. ఏమైంది , ఈ రోజు.. ఒంట్లో కానీ బాలేదా?
అసలు పనిమనిషి ఆలోచన మరిచిపోయి, అమ్మాయి డోర్ పక్కనే ఉన్న కాలింగ్ బెల్ నొక్కాను. రెండుసార్లు నొక్కాక, డోర్ తీసింది. చూసి ఆశ్చరపోయాను.ఏడ్చి ఎర్రగా ఉబ్బిన కళ్ళు, ఎప్పుడు నీటుగా ఉండే జుట్టు కు చిందరవందరగా క్లిప్ పెట్టుకుంది.
కొత్తగా పెళ్లి అయి నాలుగు నెల ల కింద వచ్చారు, ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉo టారు. ఎప్పుడు నవ్వుకుంటూ , సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే అలా సరదాగా బయటికెల్తూ ఉంటారు. ఎన్నడూ ఇలా చూడలేదు
రండి అంటి.. అంటూ పిలుస్తున్న ఆ అమ్మాయి.. అదే .. పేరు చెప్పలేదు కదూ..
సుధ.. పిలుస్తున్నా వెళ్లకుండా.
. ఏమైంది ? సుధా, అలాఉన్నావు, ఇలా రా . అంటూ బయటకు పిలిచాను కంగారుగా.బయటికి వచ్చింది, కానీ మాట్లాడలేదు.
అరే.. మాట్లాడ వేంటి? ఏమైంది? రెట్టించి అడిగాను చిన్నగా చెప్పడం మొదలు పెట్టింది.
"కాదాంటి, నిన్న కూరగాయలకు వెళ్ళామాఆ క్కడ టమాటాలు రేటు ఎక్కువ అని మనము తీసుకోలేదు, పచ్చిమిర్చి కూడా రేట్ ఎక్కువగా ఉంది, పొడి కారం వాడుకోవచ్చు అని మీరన్నారుఅవి కూడా పావు కిలోనే తీసుకున్నమా..
""ఆవునూ.. "( దానికి, దీనికి సoబందం ఏంటీ? మనసులో అనుకుంటూ )
"మరి ఉదయం చింత పండు చారు చేశాను. పల్లిచట్నీలో కూడా పచ్చి మిర్చీ తో కొద్దిగా ఎండు మిర్చీ వేసి చేశాను.
-
"ఆ... అయితే....?" అడిగాను.
" దానికి అయన అరిచారు. టమాట చారులేకుండా చింత పండు చారు తిననని తెలుసుకదా!అంటూ పల్లి చెట్నీలో ఎండు మిర్చీ వేయడం ఏంటని అరిచాడు.
నేను రేట్ల గురించి చెప్పబోతే వినిపించుకోక పోగా నాకే ఎదురు చెప్తావా? అంటూ, ఇంకా అరుస్తూ మీ వాళ్లందరిని పిలుస్తాను. ఇలా ఎదురు తిరిగే భార్య వద్దు ఇప్పుడే ఇలా ఎదురు తిరిగితే ముందు ముందు ఎలా ఉంటావ్ అని నీకు డైవర్స్ ఇస్తా అంటూ టిఫిన్ అక్కడ పడేసి బాక్స్ తీసుకోకుండా వెళ్ళాడు అంటి " అంటూ నన్ను పట్టుకుని బోర్ న ఏడ్చేసింది.
పాపంచిన్న పిల్ల కొత్త సంసారం.. మొదటి సారి భర్త కోపం చూసి బయపడింది.
అందులో డైవర్స్ అన్న మాటకే ఎక్కువబయపడినట్టుంది.
అమ్మాయిని అయితే ఓదారుస్తున్న. కానీ ఏమి చేయాలో అర్ధం కాలేదు.
ఇంత చిన్నవిషయానీకా గొడవా? అనుకుంటూ ..
" ఉండమ్మా నేను మీ ఆయనతో మాట్లాడుతాను . ఫోన్ కలిపి ఇవ్వు. " అన్నాను.
" వద్దు అంటీ, అందరికి చెప్తావా అంటూ ఇంకా కోపం పెంచుకుంటాడు. " అంటే
" పర్లేదు, ఎక్కడో ఉన్న మీవాళ్లను పిలిచి నీకు డైవర్స్ ఇస్తా అంటాడు. నేనే చెప్తా" అన్న
భయపడు తూనే ,ఫోన్ కలిపి ఇచ్చింది. ఫోన్ తీసాడు. మొదట్లో కోపంగా మాట్లాడాడు.
మా అమ్మాయిరోజు నాకిష్టం లేని వంట చేయదు. అంటూ చెప్పబోయాడు .
నేను చాలా సేపు నచ్చచెప్పి.. " బాబూ!, ఏవైనా ఇంటి ఖర్చుల్లో కిరణాలాంటివి పరిస్థితుల వల్ల రేట్లు పెరిగితే నూనె , సబ్బులలాంటివి ఎలా ఉన్నాకొనాలిసిందే కానీ పప్పులు, కూరగాయలు , లాంటివి ఒకదాని బదులు ఒకటి రేట్లు చూసి కొనవచ్చు. టమాటా ఉల్లి గడ్డలు లాంటివి రేట్లు ఎక్కువగా వున్నప్పుడు వాడకపోవడమే మంచిది.
నీకే కదా ఖర్చు మిగిలేది?
సంసారం అన్నాక సర్దుబాటు ఉండాలి. ఈ ఉపాయం కూడా సుధాకు నేనే చెప్పాను. చూడు చిన్న పిల్ల. నీవు కొత్త ఎలా ఏడ్చుకుంటూ కూచుందో
చూడు, అని సర్ది చెప్పాను. కొంచెం మెత్త పడ్డాడు.
ఫోన్ పెట్టేసేవరకు పనిమనిషి రాత్తాలు వచ్చింది.
" ఏంటే, ఇంత ఆలస్యం అయింది? అంటే మాట్లాడకుండా లోపలికెళ్లి పనిలోకి దూరింది.
,
ఏంటే , అడుగుతుంటే మాట్లాడవు? గట్టిగానే అడిగాను వెనుకే వెళ్లి.
ఒక్కసారి బోరున ఏడుస్తూ అమ్మా , చూడమ్మా రాత్రి మా అయన ఎట్లా కొట్టాడో.. అంటూ వీపు చూపించింది
" ఏం తాగి వచ్చాడా "
అడిగాను.
"లేదమ్మా, అంతసేపు ఎక్కడికి పోయాడో, రాత్రి పదింటికి అరకిలో టమాటలు తీసుకువచ్చి అప్పటికప్పుడు టమాట పప్పు చేయమన్నాడు.
నేను అంతరేటు పెట్టి కొన్నావా అని అడిగినందుకు కోపంతో అరుస్తూ కొట్టాడు. అమ్మా,
పక్కనే ఉన్న మా అమ్మా అత్తమ్మ వాళ్ళు వచ్చి, ఆడ్ని తిట్టారు నన్నుకూడా తిట్టారమ్మ, ఆడి సొమ్ము ఆడు ఖర్చుపెట్టుకుంటే వండి పెట్టడానికి ఏం రోగమని, కాదమ్మా ఆడబ్బులు మిగులితే నాలుగురోజుల కూరగాయలకి ఒత్తయి కదమ్మా! అంది రత్తాలు.
నిజమే కదా!
పాపం పిచ్చిది టమాటా కొరకు ఒళ్ళు హూనం చేసుకుంది. అయినా పొదుపుగా ఉండమని పెళ్ళాలు చెప్పేది తమ కుటుంబం కొరకే కదా!.
ఈ మొగుళ్లకు ఎప్పుడు అర్ధమవుతుందో!
ఇలా అనుకుంటుండగానే శ్రీ వారి నుండి ఫోన్. ఏమోయ్.. ఏం చేస్తున్నావ్
నేను సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేవరకు టమాటా బాత్ చేసివుంచు తినాలని పిస్తుంది. అంటూ...
నాకు చిర్రేత్తు కొచ్చింది. వీళ్లు కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగానే రేట్స్ ఎక్కువ అనేవరకు ఇంకా ఎక్కువ తినాలని పిస్తుందా! ఏమో!ఏదైనా విరివిగా దొరికినప్పుడు విలువ తెలువదు. మితంగా వున్నప్పుడే అందనంత దూరంలో ఉన్నప్పుడే వాటి మీద కోరిక ఎక్కువ అవుతుంది. అనుకుని
శ్రీ వారికి సమాధానం చెప్పకుండానే ఫోన్ కట్ చేసింది.
కట్ చేస్తే మీకు మాయింట్లో తర్వాతి సీన్ అర్థమై ఉంటుంది.
కోపాలు, అలకలు, బతిమిలాడు కోవడాలు. అబ్బబ్భా...
## కధ సమాప్తం ##
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి