"ఎడారి చినుకు" (దీర్ఘ కవిత....సమీక్ష)----సత్య గౌరి .మోగంటి .
 ఇది చిన్న పుస్తకం.(కానీ అనంతమైన భావోద్వేగం))దీర్ఘకవిత.
కానీ చివరకు వచ్చేసరికి మనసులో రకరకాల భావోద్వేగాలు మనసును నీలి మేఘాల్లా కమ్మేశాయి.
ఉద్విగ్నతతో గుండె బరువెక్కింది.
వాల్మీకి శోకం నుండి శ్లోకం జనించినట్టు
ఆమె శోకం నుండి  కవితల వెల్లువ,
ఆవేదన నుండి రచన,తెగువ ఆవిర్భవించాయి.
ఆమె గుండె చెరువైంది.
నరాలన్నీ మెలితిరిగాయి.
కనుల ముందు ప్రియమైన వాస్తవం 
కలలా కరిగిపోతుంటే
బంధువుల మాటలు తూటాల్లా
గుండెను చీలుస్తుంటే
గుండె గుడిలోని దేవుడు 
మంటల్లో మసైపోతుంటే
ఆ జ్ఞాపకాలను మసి చేయలేక
నిస్త్రాణ అయిపోతే
మనవరాలి రూపంలో పాపగా వచ్చి నిస్త్రాణయైన అమ్మమ్మని  అమ్మని చేస్తే..
తన మగని ఆ రూపంలో చూసి మురిసిపోయింది ఆ తల్లి.
పుట్టెడు దిగులులోను, తనే తన మగనికి తల కొరివి పెట్ట వలసినప్పుడు కూడా కాలం చెల్లిన సంప్రదాయాల పట్ల బాధాతప్త హృదయ అయిందే గానీ ఎవ్వరినీ తూలనాడలేదు.
 'కొన్ని ఉదాహరణలు:
నిశి బూసిన మానసాన
స్మశాన నిశ్శబ్దం ఆవరించినవి .
నిర్వీర్యమైన స్థితిలో ఉంటే 
మగని జ్ఞాపకాలలో ఉన్న
'ఇప్పుడు నా చెంప తడవలేదని గుసగుసలు
మగనిపై మక్కువ లేదని నిందారోపణలు
నా పారవశ్యానికి అంతరాయం కలిగిస్తూ అడ్డంకులు'
ఆ కఠిన సమయంలో 'తన బీజంతో వంశోద్దారణ చేసిన నన్ను
చెల్లని నాణెం చేసిన శ్రేయోభిలాషులు'
  "ఎవరైనా నా అడుగుజాడలలో నడిస్తే నాదే ముందడుగు"
'నా దేవదేవుని శిరస్సుకు
స్వయంగా రగులుతూ నిప్పెట్టాను.
కపలమోక్షమయ్యె వరకూ కఠిన శిలనయ్యాను.'
 'అస్తమయం నుండి ఉద్భవించిన ఉదయం
శిశిరంలో విరగబూసిన వసంతం'
మనవరాలి రాక. 
'ఆ తేనె కళ్లని చూసినప్పుడల్లా అనుకుంటాను.
పునర్జన్మించిన శ్రీనివాసేనని.'
ఆమె అన్నట్టు ఆడవారికి కావలసినది రిజర్వేషన్లు కాదు.
సమాన హక్కులు.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కవిత చెప్పాలి.
మనం చదివితే కలిగే ఆ ఉద్విగ్నతే వేరు.
మరిన్ని రచనలు ఆమె కలం నుండి రావాలని..
ధైర్య,స్థైర్యాలు ఝాన్సీ సొత్తు కాదు మహిళల అందరి సొత్తూ కావాలని.
                              ***
సూచన : పుస్తకం కావలసిన వారు నేరుగా కవయిత్రి 
మొబైల్ నం .తో సంప్రదించవచ్చును..
రచన:కొప్పిశెట్టి ఝాన్సీ.
9866059615
వెల :150/_


కామెంట్‌లు