నారదుడు ;- కొప్పరపు తాయారు



  త్రిలోకసంచారి త్రిలోక గురువు  నారాయుడికి పరమ భక్తుడు అయిన నారదుడు. తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు ప్రభావం వల్ల ప్రపంచంలోప్రతీ ఒక్కరూ భయభ్రాంతులకు గురి అయ్యారు.మొట్టమొదట.భయపడింది ఇంద్రుడు. ఎక్కడ తన సింహాసనానికి  ముప్పు ఉందేమో అని భయపడి మన్మధుడిని పంపిస్తాడు. కానీ ఆ బాణాలు మాయలు పనిచేయవు. ఆయన ఏకాగ్రత భక్తితో తపస్సు చేయడం వలన ఆ బాణం పని చేయలేదు అక్కడ స్థల మహత్యం కూడా ఉంది అదే స్థలంలో మన్మధుడు శివుడి కోపానికి గురై శరీరాన్ని కోల్పోతాడు. కానీ  నారదుడు తన తపస్సు వల్లే అని అహంకారంతో అందరి దగ్గరికి వెళ్లి తన గొప్ప చెప్పుకుంటాడు ఎవరు చెప్పినా వినడు. ఒక్క నారాయణమూర్తి దగ్గరికి వెళ్లి చెప్తే ఆయన మెచ్చుకుంటారు.
       భూలోకంలో కళ్యాణపురం అనే రాజ్యానికి వెళ్తాడు ఆ రాజు తన కుమార్తె జాతకం చూసి ఎలా ఉందో చెప్పమన్నాడు ఆమెను చూడగానే  నారదుడికి వివాహం చేసుకోవాలని ఆశ పుడుతుంది  కానీ జాతకరీత్యా ఆమెశ్రీమన్నారాయణునివివాహం
చేసుకుసుకుంటుందనితెలుసుకుంటాడు .
   వెంటనే శ్రీమన్నారాయణని దగ్గరికి వెళ్ళి ఒక్క రోజు శ్రీమన్నారాయణ రూపము తనకిమ్మని అడుగుతాడు సరే అని హరి ఒప్పుకుంటాడు.
             స్వయం వరానికి వెళ్తాడు ఆ రాకుమారి వరమాల పట్టుకుని నారదుడిని దాటి నారాయణు ని మెడలో వరమాల వేస్తుంది. తర్వాత అందరూ  నారదుడి రూపం చూసి నవ్వుతారు. కోపం వచ్చివారందరినీ రాక్షసులుగాపుట్టమనిశాపంఇస్తాడు. నారాయణుడి దగ్గరికి వెళ్లి నాకు ఈ రూపం ఇవ్వడం న్యాయమేనా అంటాడు. అని శపిస్తాడు మళ్లీ జన్మలో నువ్వు ఇప్పుడు నేను ఎంత బాధ  అనుభవిస్తున్నానో అంత బాధ భార్య వియోగం వల్ల అనుభవిస్తావ్ అని శాపం ఇస్తాడు. అప్పుడు ఈ కోతి రూపాలే మీ ఇద్దరినీ కలుపుతాయి అని చెప్తాడు.
  ఈ శాప కారణమే  రామావతారం .
కామెంట్‌లు