జీవచ్ఛవం (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 రంగులకలలో విహరించి, అదే జీవితమని భావించి, ఉన్న ఊరూ, కన్నవాళ్ళూ వ్యర్థులని, నిన్ను ఎదగనీయక అణగదొక్కుతున్నారని,
ఊరుకానిఊరును తనఊరనితలచి,
కానివాళ్ళను తనవాళ్ళనితలచి, ఎగిరివచ్చే సీతాకోకచిలుకా! నీ అవసరాన్ని తమ అవకాశంగా మార్చుకుని, నీ అంగాంగప్రదర్శన చేయించిమరీ కోట్లు దండుకుని ఖుషీ చేస్తూ నిన్ను అమాంతం కురూపిగాచేసే దొంగనాయాళ్ళున్నారు సుమా! నీ రంగులూ హంగులూ ఉన్నంతకాలమే
నిన్ను వాడుకుని ఆనక నిన్ను చెత్తకుండీలో పారేస్తారని తెలియక వచ్చిన తరుణీ! నీ రంగు వెలిసిపోయేసరికి, నీ కలలన్నీ కల్లలయ్యేసరికి, నీకు ఆత్మజ్ఞానం కలిగేసరికి, నీ జీవితమంతా ముగిసి జీవచ్ఛవానివౌతావు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకో! తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!!!
+++++++++++++++++++++++++
.
కామెంట్‌లు