చంద్రాయన్ వ్యోమనౌక-(బాలగేయ కథ)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చలాకి పిల్లలు రారండి
చంద్రుని గూర్చి తెలిపెదను
అందరూ వచ్చి చేరండి
చక్కగా మీరు వినంరడి

మన భారత శాస్త్రజ్ఞులు
చంద్రాయనము గూర్చి
ఎంతెంతో శోదించి సాధించి
వారి పరిజ్ఞానాన్ని చాటుతూ !!

ఎల్ వీ ఎం-3-ఎం4 అనే రాకెట్ 
బాహుబలి అనే పేరు తో రూపొందించి
పదిలముగా పైకి పంపారు
తొలి యంకం పూర్తి చేశారు !!

అగ్నిజ్వాలలు చిమ్ముతూ 
రాకెట్ రెక్కలు విప్పుకుని
ఎంతో చక్కగా వెళ్ళింది
నిర్జీత కక్షలోకి చేరింది !!

ఆ రాకెట్ ఆగస్టు 23 నాడు
సాయంకాల సమయం లో
5 గంటల 47 నిమిషములకు
జాబిల్లి ఉప్పరి తలం పై దిగుతుంది !!

కానీ పిల్లల్లారా వినరండి
41 రోజు తర్వాత వ్యోమనౌక
చంద్రుని గూర్చి వివరాలను
మన భూమి పైకి పంపిస్తుంది !!

చిట్టి పొట్టి చిన్నారి పిల్లల్లారా
చంద్రాయన నౌక గూర్చి విన్నారా
మీరంతా పెద్ద చదువులు చదివి
జాబిల్లి పైకి వెళ్తారు కదు పిల్లల్లారా !!


కామెంట్‌లు