పిల్లల పుస్తక పఠనం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పిల్లలతో కలిసి పుస్తకం చదవండి మీరు చదివిన ఆ పుస్తకంలోని పాత్రలను గురించి పిల్లలతో మాట్లాడండి  ఆ పాత్రలను గురించిన అనుమానాలు పిల్లలకు వస్తే  మీరు విసుకు చెందక  వారికి వివరంగా చెప్పినట్లయితే  ఆ చిన్న మెదడుకు మానవ మానసిక విశ్లేషణ  తెలుసుకోవడానికి  బీజం వేసిన వారు అవుతారు  ఆ వయసు పెరిగి యువకులుగా అయిన తర్వాత మీకే పాఠాలు చెప్పగలిగిన స్థితికి వారు  ఎదగడం మీరు గమనిస్తారు  ఆ పిల్లలతో గడిపే సమయం మీకు ఎంత విలువైనదో  పిల్లలకు అంతే విలువైనది  ఒక ఉపాధ్యాయుని లాగా మీరు అనుభవ పూర్వకంగా విశేషాలు చెబుతూ ఉంటే  విద్యార్థుల లాగా వారి వెంట ఉంటే  ఆ సమయం కానీ ఆ సమయంలో వారికి నేర్పే విలువలు కానీ  జీవితంలో ఉండవు అని మీరు గమనిస్తే తప్పకుండా దీనిని అనుసరించి తీరతారు. చదవడానికి నాకు సమయం దొరకదు నా పుస్తకాలు చదవడానికి నాకు తీరిక ఉండదు అని విసుక్కునే కొంతమంది పిల్లలకు  నటుడిగా టెలివిజన్ వ్యాఖ్యాతగా అమితాబ్బచ్చన్ అందరికీ తెలిసిన వాడే  వారి తండ్రి మంచి కవి  సినిమాలలో పాటలు రాయడమే కాకుండా అద్భుతమైన కవితలను హిందీలో ప్రచురించిన వారు  తండ్రి గారి కవితలను  మధ్య మధ్యలో అమితాబ్ బచ్చన్ ఉదాహరించడం వారి కార్యక్రమాలలో చూస్తుంటాం  వారికి ఏ కొంచెం సమయం దొరికిన ఇంగ్లీష్ పుస్తకాలని హిందీ పుస్తకాన్ని  చాలా బాగా చదువుతారు  ఆయన చదివిన మంచి పుస్తకాన్ని గురించి  సామాజిక మాధ్యమాలలో వివరిస్తూ ఉంటారు  అన్ని వ్యాసంగాలు పెట్టుకున్న అమితాబ్ గారికే సమయం కుదిరినప్పుడు మనకెందుకు కుదరదు అని మీరు ప్రశ్నించుకుంటే  తప్పకుండా పుస్తకాలు చదవడానికి ముందుకు వస్తారు అని నా నమ్మకం. చిన్నప్పుడు మనకు చెప్పే మొదటి పాఠం  శ్రీరాముని దయతో  పుస్తకాన్ని చేత బట్టి దానిలో ఉన్న ప్రతి అక్షరాన్ని చదివి తీరతానని ప్రతిజ్ఞ చెప్పే పద్యం  పిల్లలందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది  ఆ పద్యం పిల్లల్లో నాంది వచనం  ఆ వయసుకు సంబంధించిన విషయాలను అన్నిటిని  ఉపాధ్యాయుడు వెనక ఉండి నడిపించడం వల్ల  అటు చదువులోనూ  ఇటు గణితశాస్త్రంలోనూ  చిన్నతనంలోనే ప్రావీణ్యం కలిగిన వారిగా  మన ముందుకు వస్తున్నారు  నిజానికి ఏ పిల్లలు అయినా సరే పుస్తకం చూడగానే దూరంగా పరిగెత్తే వయస్సు  ఆటల మీద ఉన్న దృష్టి చదువు మీద ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే  అలాంటి వారితో కూడా చక్కగా చదివించి  ఉన్నతులను చేసి తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు  ప్రతి ఒక్కరూ కూడా అభినందనీయులే.


కామెంట్‌లు