హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 166
🦚🦚🦚🦚
మంచి ఆలోచనలే 
ఆనందాలంబన......!
సదా సదాచరణలే
మహదానందాస్వాదన.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 167
🦚🦚🦚🦚 
చచ్చి సాధించేది
ఏమీ లేదు ఇలలో.....!
బ్రతికి సాధించాలి
కదా జన స్రవంతిలో ...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 168
🦚🦚🦚🦚
అక్షరాలను కలిపితే
అర్థాల పరుగులు......!
శిక్షణలను జోడిస్తే 
పరమార్థపు మెరుగులు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 169
🦚🦚🦚🦚 
అమావాస్య తిథికి
చంద్రిక తిరస్కారం‌‌‌ ‌‌.....!
పాడ్యమి అ(తిథి) రాకతో
సాత్విక పరిష్కారం........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 170
🦚🦚🦚🦚 
కాలము మన కొలమానము
చేయుము సద్వినియోగము ‌‌....!
పదునైన పనియె వజ్రము
వృధా యేల విలిప్తము..........!!
                        (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు