నా పంచపదుల సంఖ్య---1008.తల్లిపాల వారోత్సవాల లక్ష్యం, "తల్లులు పాలివ్వాలి"!నేడు సమాజాన ఓవర్గం, తల్లుల్ని పాలివ్వమనాలి!నూట ఇరవై దేశాల్లో, ఉత్సవాలు సమస్య చెప్పాలి!తల్లి పాల కోసం మరో అడుగు, ముందుకు వేయించాలి!వారోత్సవాల్లోనే కాకుండా, నిత్యం,తల్లులు పాలివ్వాలి,పివిఎల్!1009.తల్లిపాలు తాగిన బిడ్డ, ఆరోగ్యం సర్వదా భద్రము!తల్లిపాలు బిడ్డకు అమృతం, సరిపోషకాహారము!భవిష్యత్తులో, డయాబెటిస్, వంటి రోగాలు దూరము !శైశవాన తల్లిపాలు ,భావి రోగనిరోధకత్వము!"మాతృదేవోభవ" బీజం,తల్లిపాలు తాగి పెరగడం, పివిఎల్!1010.బిడ్డకు పాలివ్వడం తల్లికి, సైతం చేయు ఎంతో మేలు!ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్,కల్పించు సరి వీలు!తల్లిని పడకుండా చేయు,బ్రెస్ట్ క్యాన్సర్ రోగం పాలు!మొదటి ఆరు నెలలు తప్పదు, బహుమేలు ఓసాలు!తల్లిపాలతో తల్లి బిడ్డల, బంధం మరింత బలిష్టం,పివిఎల్!_________
పంచపది ,;- చేద్దాం, నిత్యోత్సవాలు!;- డా. పి వి ఎల్ సుబ్బారావు, 94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి