మన గన్నవరం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆకాశవాణిలో  ధర్మసందేహాలు ద్వారా  ప్రఖ్యాతి పొందిన ఉషశ్రీ గారి  సోదరుడు  రంగనాథ్  రేడియో నాటకాలు రాయడానికి కూడా  శాస్త్రీయ విషయాలను గురించిన  కథాంశాలను తీసుకొని  దానిని నాటికగా కానీ నాటకంగా కానీ మలిచి  వ్రాసేవాడు  చిన్నపిల్లల కార్యక్రమంలో కూడా  వారి స్థాయికి తగినట్లుగా  నాటకాలు  బాలల కోసం  వ్రాసేవాడు  వారు రాసిన నాటకాలలో బాహుబలి  చాలా మంచి పేరు తీసుకొచ్చింది  ఆకాశవాణిలో అనేక పర్యాయాలు ప్రసారం చేశారు  దానిని విజయవాడలో  విశాఖపట్నంలో కూడా నేను  ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం  దానిలో ప్రధాన భూమిక  చదవడం నాకు వచ్చిన అవకాశం  ఆ రంగనాథ్  మాతోపాటు కోటిరెడ్డి కూడా  చాలా సన్నిహితమైన వ్యక్తి.
మేముగ్గురం కూర్చుంటే  ఏ విషయాన్ని గురించి మాట్లాడిన చివరకు  ప్రతి విషయం  భోజనం దగ్గర నుంచి  శాస్త్రీయ దృక్పథంలోనే మాట్లాడుకోవడం అలవాటైపోయింది  దానితో ఒక  సంస్థ ఏర్పాటు చేసి  ఆస్తిక నాస్తిక వాదాలను కాకుండా  అసలు ఈ భూమి మీద  ప్రతి ప్రాణి కదలడానికి  భూమి కదులుతూ ఉన్న తాను పడిపోకుండా ఉండడానికి  కారణాలను సామాన్య ప్రజలకు  తెలియజేయడం కోసం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి  రంగనాథ్ కోటిరెడ్డిలతో పాటు  ఆ విషయంలో నేర్పరులైన వారిని పిలిచి వారి ద్వారా కూడా  చాలా విషయాలు చెప్పించుకునేవాడు  అలా మానవ జాతిని నడిపిస్తున్న శక్తి ఏమిటి అన్న విషయాన్ని గురించి కూలంకషంగా కార్యక్రమాలు చాలా చేశాము.
మాకు అక్షరాలు నేర్పిన మా గ్రామ విద్యాలయానికి ప్రతి సంవత్సరం వెళ్లి  పాత విద్యార్థుల సమాఖ్య తరఫున  అనేక విషయాలను  కొత్తవారికి చెప్పడం  మాలో ఎవరు ఏ విషయాన్ని చెప్పడానికి  అర్హులో  వారు ఆ విషయాన్ని  హెచ్ఎం గారి అనుమతితో చెప్పడం  చెప్పినది వారి జీర్ణించకున్నారో లేదో అని ప్రశ్నల ద్వారా  నిర్ణయించడం వల్ల  కొత్త విద్యార్థులలో కూడా  ఉత్సాహం పెంచే వాళ్ళం  మాలో ఎవరు కూడా  ఏ పార్టీకి సంబంధం లేకుండా  ఏ విషయాలు చెప్పదలుచుకున్నామో ఆ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి  మాట్లాడడం తప్ప మరొక  దృష్టి లేదు కనుక  మాకు ఎలాంటి  రాజకీయ ముద్రలు పడలేదు  శాస్త్రీయ విషయాలు చెప్పడం వరకే పరిమితం చేసుకున్నాం  అవి కొత్తవారు కూడా నిర్వహిస్తారని మా ఆశ ఆకాంక్ష.


కామెంట్‌లు