ఇదో రకం స్వామి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ప్రతి మనిషికి సామాన్యంగా  కావలసిన మొదటి  అవసరం మానాన్ని కాపాడుకోవడం  దానికోసం ఆర్థిక స్తోమతను బట్టి  గోచి తో ప్రారంభించి  కోటు బూటు సూటు వరకు వెళ్లే వ్యక్తులను మనం గమనిస్తూనే ఉంటాం  ఎలాంటి వేషం వేసినా దాని వెనుక ఉన్న విషయం మాత్రం  సిగ్గును దాయడం  మామూలు వ్యవసాయదారులు  ధరించే వస్త్రాలకు  ఉద్యోగం చేస్తూ ఆఫీసులకు వెళ్లేవారు ధరించే బట్టలకు  విలాసవంతమైన వారి  జీవితంలో ధరించే దుస్తులకు చాలా భేదం ఉంటుంది  అసలు ఈ వస్త్రాలు దేనికి  మన శాస్త్ర ప్రకారం బోడి గుండు చేయించుకున్న వాడు ముండ  విద్యార్థిని  అని  సగం బోడిగుండు వాడు ప్రచారకుడు అని  గోవు పాదమంత పిలక పెట్టుకున్న వాడు ఉపాధ్యాయుడని  మనం చెప్పుకుంటాం. వస్త్రధారణను చూసి  వారు ఏ ఏ పనులకు నియోగించబడ్డారు అన్న విషయాన్ని మనం స్పష్టంగా  గ్రహించగలం  ఇవాళ ప్రపంచం మొత్తం వ్యాపారత్మకంగా మారిపోయింది చివరకు వేదాంతం కూడా  కాషాయం ధరించి  గడ్డాలు మీసాలు జుట్టు పెంచి  విభూది రాసి  ఒక చిన్న కర్ర గాని లేదా కమండలం కానీ చేతిలో పట్టుకొని  సమాజానికి హితాన్ని చెప్పడానికి వచ్చే వ్యక్తులుగా కనిపించే కొంతమంది దొంగ సన్యాసులను గురించి  వేమన చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు  వారి భుక్తి గడవడం కోసం  తన శిష్య బృందానికి  అవసరాలను తీర్చడం కోసం  తన శిష్య బృందం దగ్గర ఎక్కువగా ఆడవారి దగ్గర  ధనాన్ని సేకరించి  మూలధనంగా మూలిగేలాగా ఏర్పాటు చేసుకోవడం వారికి నిత్య కృత్యం తలలు బోడులు చేయించుకొని జడలు ధరించి  ఒంటినిండా విభూది పూత పూసి ఉపన్యాసాలు ఇచ్చి ఆసనాలు వేసి  దానికి తగిన వేషం ధరించిన  యోగి లాగా కనిపిస్తాడే తప్ప అతను యోగి కాదు దొంగయోగి అని చెబుతున్నాడు వేమన  నిజమైన యోగి  అరిషడ్వర్గాలను వదిలివేసి ఏకాంతంగా  తపస్ సమాధికి వెళతాడే తప్ప ఇలాంటి వేషాలు వేయడు కదా  మరి ఇలాంటివి ఎందుకు వేస్తున్నారు  ధనార్జన కోసం తప్ప మరొక పరమార్ధం ఉన్నదా  అని ప్రశ్నిస్తున్నాడు వేమన  అసలు యోగి యోగిగా ఉండాలంటే అతనికి కావలసింది హృదయం  మంచి హృదయం ఎవరికీ ఉంటుందో వారే యోగి తప్ప ప్రతి ఒక్కడు యోగి కాలేదు  అన్నది వేమన సిద్ధాంతం  ఆయన రాసిన  పద్యం చదివితే ఆ దొంగతనం బయటపడుతుంది చదవండి మరి.

"బోడి తలలు జడలు బూడిద పూతలా భాషణాశనములు వేషములను యోగి గాడు లోన బాగు గాకుండెనా..."




కామెంట్‌లు