"అమృతాంజనము" ఒక
దివ్యమైన ఔషధము
నొప్పుల నివారణకు!
ఓ సుమతీ! ఓజోవతి!
(అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
👌"అంజనం" సంస్కృత పదం. దీనికి.. "చాలా సంతోషకర మైనది!" అని, అర్థము! "అంజనం" అనేది ఒక ఆయుర్వేద కంటి చికిత్స! ఇది.. శరీరంలో దురద, మరియు కళ్ళలో మంటలను తొలగించడానికి సహాయ పడుతుంది.
👌 "అమృతాంజనం"... మన స్వదేశీ ఉత్పత్తి! తల నొప్పి, నడుము నొప్పి.. మున్నగువాటికి అమోఘంగా పనిచేస్తుంది! ఒక్క మాటలో పేర్కొనాలంటే... అన్ని నొప్పులకు "సంజీవి" వంటిది! ధర.. స్వల్పము. ప్రయోజనము.. అధికము! కనుక, అమూల్య మైనదీ.. దివ్య ఔషధము!
👌"అమృతాంజనం" గురించి "సీస పద్యo" రూపంలో ప్రకటన.. "భారతి" ప్రముఖ సాహిత్య పత్రిక, 1927 ఏప్రిల్ లో వచ్చింది! ఒకసారి పరిశీలించండి!
⚜️ సీస పద్యము⚜️
అభయ మిచ్చెడు గాక! అమృతాంజనము మీకు!
పాఱఁదోలును పార్శ్వభారములను,
మృదువైన యీ మహామృత మెల్లనొప్పుల
కును, వృశ్చి కాదులు కుట్టునపుడు,
తాండవమాడుచు తహతహ పడువారి
కిని, "దివ్య సంజీవి"యనగ నిదియె
జనులకు కలియుగంబున జనించిన, కల్ప
తరువుగాని, యిది యితర మనంగ
( తేట గీతి )
[ నగునె? పెక్కుచోట్ల నన్ని యంగళులందు,
విక్రయింప బడును వింత ! సూక్ష్మ
మునను, మోక్షమన నమూల్య మయ్యును, మూల్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి