సువర్ణవకాశం* (సువర్ణ అవకాశం );- ప్రభాకర్ రావు గుండవరం(మిత్రాజీ )ఫోన్ నం.9949267638

 తాను ఎంత నచ్చ చెప్పినా తనను ఒప్పించడం ఎంతకు తనకు సాధ్యం కావడం లేదు సువర్ణకు. తాను కాలేజీల్లో  చదువుతున్నప్పుడు తన మాటల చాకచక్యం తో ఎంతో మంది పురుష పుంగవులను అట్టే ఓడించేది.మీరు చదువుల్లోనే తెలివి గల వారు అనుకున్నాము. మాటల్లో కూడా మహా రాణులే సుమా అని ఎంతో మంది ఆడవాళ్లు మగవాళ్ళు పొగిడేవారు. అటువంటిది నేను ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతాను నాకు కలెక్టర్ కావాలని ఉంది కాస్త నాకు పనిలో సహకరించండి అంటే నా ఈ మగ మహాత్ముడు ఓ పట్టానా వినడం లేదు. పైగా నా సంపాదన చాలు నీ కెందుకు శ్రమ అంటూ నన్ను ఆట పట్టిస్తూన్నాడు ఏంటి ఈ మగ మహారాజును అచ్చికలతో ముచ్చికలతో ఎన్నో రకాల సంతోషం చేసినా నాకు ఇంటి పనిలో సహాయం చేయడం లేదు ఇక కలెక్టర్ అయ్యే అదృష్టం నా నొసట రాసి పెట్టలేదేమో ఆ దేవుడు అంటూ రోజూ బాధ పడసాగింది సువర్ణ.ఈ విషయంలో తన స్నేహితులను, బంధువులను అడిగినా వారి సలహా తనకు సంతృప్తి ఇవ్వడం లేదు.
"ఓ పిచ్చి పిల్లా. ఈ మాత్రానికి ఇంత బాధ పడాలా. బంగారం లాంటి ఉద్యోగం వస్తుందంటే ఎందుకు పోగొట్టుకుంటావు. మీ ఆయనను ఆకట్టుకునే ఉపాయం నేను చెబుతాను విను" అంటూ పక్కింటి బామ్మ సువర్ణ చెవిలో చెప్పింది. ఎగిరి గంతేసింది సువర్ణ మనసు ఆ సలహాకు. మరి అంతలోనే నీరస పడి పోయింది. ఏమిటమ్మా ఆలా ఐపోయావు. ప్రయోగించి చూడు నా మాట. సాధ్యం అంటావా బామ్మా అని బేలగా అడుగుతుంటే స్తోత్రాలకు దేవుడే దిగి వస్తుంటే నీ మగడు తప్పకుండా దిగి వస్తాడు అంది.
***********
"హలో మిస్టర్ హస్బెండ్ గారూ! మీరు చెప్పినట్లు నేను ఐఏఎస్ కు ప్రిపేర్ కావడం లేదు తెలుసా అంది ఆ రాత్రి."తన భర్తతో  ముద్దుగా సువర్ణ.
" నిజంగానా అంటూ సంతోషంతో  సువర్ణను ఎత్తుకుని గిరా గిరా తింపాడు ఆపుకోలేని ఆనందం తో సురేష్. "
"అవునండి.. నిజం. మీ మాటే నా మాట" అంది తాను ఆనందపడిపోతు ప్రేమతో.
***********
రోజులు గడిచిపోతున్నాయి.ఇంకా నెల రోజులే ఉంది పరీక్షకు ప్రిపేర్ కావడానికి. గట్టిగా చదివితే గాని లాభం లేదు అనుకుంది. ఆ ఫీలింగ్ కు బాగా జ్వరం వచ్చేసింది లేవలేకుండా సువర్ణకు.సురేష్ టక్కున హాస్పిటల్ లో చేర్పించాడు సువర్ణను. పది రోజులు ఇంట్లోసురేష్ తానొక్కడే అన్ని పనులు చేసుకుంటూ భార్యకు టిఫిన్ అందిస్తూ డ్యూటీ చేసుకుంటూ గడపాసాగాడు. ముందు నాలుగు రోజులు సురేష్ కు కష్టం అనిపించినా తన భార్యకు తన వంటే తినిపించాలి హోటల్ భోజనం వద్దు అనుకుని తానే చేయసాగాడు. బాగా అలవాటయ్యింది ఇంటి పనులు. తన భర్త పడే పాట్లు చూసి బాగా బాధేసింది సువర్ణకు. మనిషి కూడా బాగా నీరసించి పోయాడు అనుకుంది. చూడు సువర్ణా నువ్వు బాగా కోలుకునేంత వరకు నేనే అన్ని చేస్తాను అని అంటూంటే సువర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. తొందరగానే కోలుకుంది సువర్ణ. పక్కింటి బామ్మ వచ్చి చూసింది. చూడమ్మా ఎలాగూ నీ భర్త నీకు అన్ని విధాల చూసుకుంటున్నాడు. ఇదే  సువర్ణా నీకు సువర్ణవకాశం నువ్వు ఇదే హాస్పిటల్ లో ఉంటూ ఈ పదిహేను రోజులు బాగా చదువుకుని పరీక్ష రాసిరా. అని బామ్మ ఆ హాస్పిటల్ డాక్టర్తో అన్ని విషయాలు వివరంగా చెప్పింది.
**********
"చూడండి సురేష్ గారూ. మీ ఆవిడ ఇప్పుడు బాగానే ఉంది. కాకపొతే నీరసంగా ఉంది కాబట్టి హాస్పిటల్ లోనే ఉంటే మందులతో పాటు బలమైన ఆహారం ఇస్తాం. కాదంటే మీరు తీసుకెళ్లి నేను చెప్పినట్లు పాటించండి అని డాక్టర్ విమల చెప్పింది.
బాగా అలోచించి ఇంకా కొన్ని రోజులే కదా నేను కష్టపడేది హాస్పిటల్ లోనే ఉంటేనే సువర్ణకు బాగుంటుంది అనుకుని సరే అన్నాడు.
బామ్మ మురిపెంగా నవ్వుకుంది ముసి ముసిగా.
     "సశేషం "
***********

కామెంట్‌లు