చిన్నారులు- -'బాలబంధు' గద్వాల సోమన్న,-9966414580.
చిన్ని చిన్ని పిల్లలు
వెన్న వంటి మనసులు
వెన్నెలమ్మ జల్లులు
వన్నె చూడ మల్లెలు

ముద్దులొలుకు బాలలు
ముద్దుబంతి తావులు
సుద్దులన్ని తేనెలు
బుద్ధులన్ని వెలుగులు

బుగ్గలు సిరిపూవులు
సిగ్గులు విరిజాజులు
ముగ్గుల్లా మాటలు
మొగ్గల్లా మోములు

అల్లరికి వారసులు 
ఎల్లరికీ ఇష్టులు
తల్లి ఒడిని పిల్లలు
వల్లిలాంటి తలపులు


కామెంట్‌లు