కొన్ని జంతువుల కళ్ళు చీకట్లో ఎందుకు మెరుస్తాయి?;- ఎస్ మౌనిక

  హలో..! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్.... ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ....మరి మీరు?.... విష్ యు ఏ వెరీ హ్యాపీ డే..... 🤝.... మీరు రాత్రి సమయంలో చీకట్లో ఉన్న పిల్లిని ఎప్పుడైనా చూశారా? చీకట్లో దాని శరీరం కనబడదు.కానీ పచ్చగా మెరుస్తున్న దాని కళ్ళు మాత్రం కనబడతాయి.అనేక జంతువుల కళ్ళు చీకట్లో ఎందుకు మెరుస్తాయో మీకు తెలుసా?.... కొన్ని జంతువుల కళ్ళలో ఒక ప్రత్యేకమైన పదార్థం యొక్క సన్నని పొర ఉంటుంది. ఇది తన మీద పడిన కాంతిని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రతిబింబించిన కాంతి మెరుపుకు కారణం. రాత్రిపూట అతి స్వల్ప మాత్రం గానైనా అంటే కొద్దిమాత్రమైన కాంతి ఆ పొర పైన పడితే చాలు... కాంతి ప్రతిబింబిస్తుంది. దాంతో కళ్ళు మెరుస్తూ మనకు కనబడతాయి. సరిగ్గా చెప్పాలంటే ఒక అద్దం మీద సూర్యకిరణాలు పడినప్పుడు అది ఎలా మెరుస్తుందో అదేవిధంగా ఈ జంతువుల కళ్ళు కూడా మెరుస్తుంటాయి. ఈ విధంగా చీకట్లో మెరిసే కళ్ళు గల జంతువులకు దృష్టి శక్తి ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట చీకట్లో మెరిసే కనులు కల జంతువులన్నిటిని మెరుపు రంగు ఒకే రంగులో ఉండదు. దీనికి కూడా కారణం ఉంది.అదేమిటంటే..... ఏ జంతువు యొక్క కంటిలో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయో ఆ జంతువు కండ్లు మెరుపు ఎర్రగాను,రక్తనాళాలు తక్కువగా ఉన్న జంతువుల కళ్ల మెరుపు తెలుపు లేదా లేత పసుపుపచ్చ రంగులో ఉంటాయి. ఇలాంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా.... ఫ్రెండ్స్!అయితే టచ్ లో ఉండండి మొలక తో.....మీ నేస్తం త్వరలో మీ ముందు ఉంటుంది.... త్వరలో కలుద్దాం.... బాయ్ ఫ్రెండ్స్👋....
కామెంట్‌లు