చందమామ.
-----------------
చంద్రుడిని 'చందమామ' అని పిలుస్తాం. సూర్యుడిని సూర్యమామా అని పిలువము. ఎందుకలా? చంద్రుడినే 'మామా' అని పిలవటం వెనుక కూడా ఓ కథ ఉంది. ఈ కథ వల్లనే చందమామ నానుడి కథలోకి వచ్చేసింది. అదెలాగో చూద్దాం. ఇది కూడా పురాణ కథల నుండి వచ్చిన నానుడి.
అమృతం కోసం పాల సముద్రాన్ని మందర పర్వతమనే కవ్వం, వాసుకి అనే నాగుపాము తాడుతో చిలికినప్పుడు అనేకమైనవి సముద్రములో నుండి వరుసగా పుడతాయి. ముందుగా హలహలం (విషం) పుడితే దాన్ని శివుడు మింగి తన కంటంలో దాచుకుంటాడు. ఆ విషం దాగిన ప్రదేశం నీలంగా మారుతుంది. అందుకే ఆయన్ని నీల కంఠుడు అంటారు. తరువాత ఐరావతం అనే ఏనుగు, రెక్కల గుర్రము, కల్ప వృక్షము, కామధేనువు, వారుని( మద్యం), అప్సరసలు, లక్ష్మిదేవి, చంద్రుడు, కౌస్తుభం ( విలువైన రత్నం), శంఖము, ఇలా పుట్టుకువస్తాయి. అన్నిటిని దేవతలు తీసుకోగా రెక్కల గుర్రం, వారునిని మాత్రమే రాక్షసులు తీసుకుంటారు. చిట్టచివరికి అమృతం చేతిలో పట్టుకుని దేవతల వైద్యుడు ధన్వంతరి పుడతాడు. ఆ అమృతాన్ని విష్ణువు మోహిని రూపంలో మయోపాయంతో దేవతలకు మాత్రమే పంచుతాడు. వారు అమరులు అవుతారు.
ఇప్పుడు చంద్రుడి వద్దకు వద్దాం. చంద్రుడు, లక్ష్మిదేవి తోబుట్టువులు కదా? లక్ష్మి దేవికి చంద్రుడు సోదరుడు. లక్ష్మి దేవి భర్త బ్రహ్మ. ఆయన మనందరిని సృష్టించిన సృష్టికర్త. అంటే మన తండ్రి. తండ్రి భార్య అయిన లక్ష్మిదేవి మనకు అమ్మ అవుతుంది. అమ్మ సోదరుడు చంద్రుడు మామ అవుతాడు. అందువల్లనే మన పూర్వులు చంద్రుడిని 'చందమామ' అని పిలిచారు. అలా అలా వచ్చింది చందమామ అనే నానుడి. ఈ నానుడి రావటానికి ఒక కథ ఉంది కాబట్టి 'చందమామ' కూడా మన నానుడి కథలలోకి వచ్చేశాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి