ఆయనొక నిప్పురవ్వ
అగాధంలో అంచులపొంగే జలరాశి!
అవినీతి,దాస్యపు శృంఖలాలను
ఈడ్చిపడేసే తుఫాన్ మెయిల్!
మెతకతనం, బానిసతనం
రెండూ ఒకటేనని చాటినవారు
లొంగిఉండటాన్ని అసహ్యించుకున్న వీరుడు!
జాతీయభావనల దిక్సూచి
సైనికపటాలం సేనాధిపతి!
గుండెల్లో ధైర్యం నిండుగా
నిలిపి పోరాటసన్నద్ధులని చేసి
జాతి గౌరవం కాపాడే ఎజెండా!
జయహో!సుభాష్ చంద్రబోస్!
జాతికిచ్చారు మహా జోష్!!
అమర్ రహే నేతాజీ!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి