హెర్క్యులిస్! అచ్యుతుని రాజ్యశ్రీ

మన భీమునిలా బలశాలి హెర్క్యులిస్ జూస్ ఆల్కమీని ల కుమారుడు.జూస్ మొదటిభార్య హీరా అసూయ తో రగిలి పోతుంది.ఊయల్లో ఉన్న చిట్టి తండ్రి పైకి రెండు భయంకర విషపు పాముల్ని వదులుతుంది.వాడు రెండు చేతులతో వాటిని పట్టుకుని పీకపిసికి చంపేస్తాడు.ఆసవతి తల్లి హీరా రకరకాలుగా చిత్రహింసలు పెట్టాలని ప్రయత్నాలు చేసింది.కానీ హెర్క్యులిస్ అవన్నీ దాటి బైటపడ్డాడు.గొప్ప యోధుడైనాడు.బాల్యంలో కృష్ణుని చంపటానికి కంసుడు
పాండవులను చంపటానికి దుర్యోధనుడు చేసిన ప్రయత్నాలు మనందరికీ తెలుసు.మరి గ్రీకు కథలు కూడా వాటిని పోలిఉండటం విచిత్రం 🌹
కామెంట్‌లు