న్యాయాలు -221
రాహు శిరో న్యాయము
****
రాహువు శిరస్సును పామని కొందరు,అదొక ఛాయా గ్రహమని మరికొందరు, రాక్షసుడని ఇంకొందరు ఇలా అనేక రకాలుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు.
ఇది మన పూర్వీకుల నమ్మకం.అందులోనూ అనేక సందేహాలు. ఇలా ఏదీ ఇదమిత్థంగా తేల్చుకోలేక సందేహపడే సందర్భాలను ఉద్దేశించి ఈ "రాహు శిరోన్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
మరి ముందుగా జ్యోతిష్య శాస్త్రంలో రాహువు ఎవరో ఎలా వుంటాడో తెలుసుకుందాం.రాహువు నల్లగా, ఎత్తుగా నాలుగు భుజములు కలిగి వుంటాడనీ,కత్తి, త్రిశూలాన్ని,కవచ ధారణ చేసి వుంటాడని అంటారు. ఇతడిని అపసవ్య దిశలో నడిచే స్త్రీ గ్రహంగా భావిస్తారు.అంతే కాదు వాస్తుశాస్త్ర పరంగా,జాతక పరంగా అత్యంత రాహువు ప్రమాదకరమైన గ్రహమని, పాప గ్రహమని చెబుతుంటారు.
ఇక రాహువు శరీర పైభాగం పాము తల ఉంటుందనీ, అందుకే అది విషాన్ని కలిగి ఉంటుందని అంటుంటారు.
ఇక ఈ రాహువు రోదసిలో వుంటూ సూర్యుడిని కొంత కాలం కనిపించకుండా చేస్తాడనీ అందుకే సూర్య గ్రహణం ఏర్పడుతుందని కొందరంటే సూర్యుడిని రాహువు మింగడం వల్లే సూర్య గ్రహణం ఏర్పడుతుందని మరి కొందరు అంటుంటారు.
అయితే ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు అంటే భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుని యొక్క నీడ వల్ల భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు.ఇలా సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది. అలాగని ప్రతి అమావాస్య రోజున ఏర్పడదు. అలా పై విధంగా అరుదైన సమయంలో మాత్రమే గ్రహణం ఏర్పడుతుంది.
ఇదండీ రాహు శిరో న్యాయము వెనుక ఉన్న అసలు విషయము.
అయితే శాస్త్రీయత ఎంత అభివృద్ధి చెందినా,నిరూపణలతో ఉదహరించినా యుగయుగాలుగా మానవుల నరనరాల్లో ఇంకిపోయిన నమ్మకాలు, విశ్వాసాలు ఒక పట్టాన మారవు. అందుకే ఓ మహనీయుడు ఇలా అంటాడు " మానవులు నమ్మకాల్లోనే పుట్టి, నమ్మకాలతోనే పెరిగి, నమ్మకాల్లోనే మరణిస్తాడు " . కాబట్టి వాటి జోలికి పోకుండా,ఎటూ తేల్చుకోలేక సందేహపడే, సతమతమయ్యే సందర్భాలలోనూ , ఎంత వాదించినా ఎదుటి వారి నమ్మకపు పట్టును గెలవలేని సమయాల్లో "ఈ రాహు శిరోన్యాయము"ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.అంతే కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి