ఫోటో గ్రఫీ.... లైట్ డ్రాయింగ్ !;- కోరాడ నరసింహా రావు

  ఎత్తు - పల్లాల వెలుగు నీడలతో... బింబాలకు ప్రతిబింబాలను  అందించే కెమెరాతో...ఫోటోగ్రాఫర్ అనుభవం తోడై...అందమైన ఫోటోలై.... 
ఆనందాన్ని కలిగిస్తాయి !
ఫోటోగ్రఫీ అంటే... వర్తమానాన్ని 
భవిష్యత్తుకు...  భద్రపరచి అందించే మధురస్మృతి !
 గతమొక తీపిజ్ఞాపకం గా పదే పదే చూసుకునే గొప్ప అవకాశం !
      ఫోటోగ్రాఫర్ చాకచాక్యంతోనే... మంచి ఫోటో రాగలదు !
    కెమెరా ఎంత గొప్పదైనా దాన్ని చక్కగా వాడగలిగే సత్తా ఉంటేనే మంచిఫోటోను పొందగలిగేది !
      ఒకప్పుడు ఒక మంచి ఫోటో రావాలి అంటే... ఫోటోగ్రాఫర్ ఎంతో శ్రమించవలసి వచ్చేది !
     ఉన్న వెలుగును బట్టి, కెమెరా లెన్స్ లో అపర్చేర్ &షట్టర్ స్పీడ్ లను సెట్చేసుకోవటం, సరైన ఏంగిల్ లో... చక్కని పోజును పెట్టించి ఫోటో తియ్యటం ఒకెత్తయితే...
ఆ కెమెరాలోనుండి ఫిల్ము ను తీసి... డార్కురూములో నెగెటివ్గా తయారుచేసి... ఆ నెగిటివ్ పై పెన్సిల్ మొనతో ముఖంపై ఉన్న మచ్చలు మరకలు తొలగించి చొక్కిదవ డ లను నింపుగా మలచి నలుపుగా ఉన్న ముఖమైనా కాస్త తెలుపుగా... అందంగా తయారు చేసి... ఆ నెగిటివ్ను మరలా డార్క్ రూంలో ఎన్ లార్జర్ పై కావలసిన సైజును సెట్ చేసి ఫోటోపేపెర్ పై ప్రింట్ చేసి కెమికల్స్ లో ఆ పేపర్ ను డిప్ చేస్తే ప్రతిబింబం దర్శనమిస్తుంది !అది అలాగే స్థిరంగా ఉండేందుకు హైపో ద్రావణం లో ఉంచి, ఆ తరువాత దానిని మంచి నీళ్లతో బాగా కడిగి... హీటర్ లో డ్రై చేసి... ఆ ఫోటోపై కూడా పెన్సిల్, బ్లేడ్ ఉపయోగించి ఫినిషింగ్  టచ్ లిచ్చి అందమైన అట్టపై, ఆ ఫోటోను అంటించి... 
 క్రింద కుడివైపు కార్నర్లో ఆ స్టూడియో నేమ్ స్టిక్కరును అతికించి కవరులో పెట్టి... 
  కస్టమర్ కు అందిస్తే..... అందముగా కనిపించే తమ ముఖచిత్రాలను చూసుకుని వారు ఎంత మురిసి పోతారో కదా..... వాళ్ళ ఆనందం వెనుక ఆ ఫోటోగ్రాఫర్ శ్రమ, ప్రతిభ ఎంతుందో... ఆలోచించే వారెందరు... !?
   ఈ రోజు ఫోటోగ్రఫీ అంటే.... చిన్నపిల్లల ఆట ఆటే అయిపోయింది !!
   ఆ శ్రమ గానీ.... ఆ విద్వత్తుగానీ.. డార్క్ రూము లో ఆ పరిశ్రమ గానీ ఇవేవీ లేకుండా... అసలు నెగిటివ్ అనే ఫిల్మే  లేకుOడా... ఎంతో సులువును, సుఖాన్నీ అందించింది ఈ ఆధునిక విజ్ఞానం..... !
       ఫోటోగ్రఫీ వర్ధిల్లాలి.... !
   వర్ధిల్లాలి ఫోటోగ్రఫీ... !!
      *******
    కోరాడ నరసింహా రావు 
ఓల్డ్ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్.
కామెంట్‌లు