మనిషి సంతోషకరమైన జీవితానికి మార్కాండేయ మహర్షి చెప్పిన మూడు మార్గాలు సకల మానవాళికి ఆదర్శం మరియు అనుసరణీయం.అందులో ముఖ్యమైనది సాత్వికత. ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనని పెంపొందించుకునే మార్గమే సాత్వికత. నియమం నిబద్ధతని ఇస్తుంది. ఆ నిబద్ధత లక్ష్యం దిశగా ఉండే మీ మార్గాన్ని సుగమం చేస్తుంది. నియమమైన ఆహారం శరీరానికి ఆరోగ్యాన్నిస్తే. ధ్యానం, దానం మనసుకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.మానవుడు సాత్వికత, లోకహితం కోరినవాడై వుండాలని శాస్త్ర వాక్యం.శ్రీకృష్ణుడు భగవద్గీతలో తనకు అర్పించకుండా భుజించిన ఆహారం పాపభూయిష్ట మైనదని, అందువలన నిష్కృతి లేని పాపా లు మూటగ ట్టు కుంటారని, అదేవిధంగా భగవంతునికి అర్పించి, పావనం చేసిన పిమ్మట తీసుకున్న ఆహారం అమృతతుల్య మని అందువలన జీవునకు ఇహం లో, పరంలోనూ శ్రేయస్సు కలుగుతుందని సెలవిచ్చి ఉన్నారు. మనం స్వీకరించే ఆహారం పవిత్రమైనది, ధర్మయుతమైనది, శుద్ధమైనది అయితే సాత్వికత ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుందని పతంజలి యోగ సూత్రాలు కూడా చెబుతున్నాయి.
మనస్సు నిత్యం ఆందోళనకు, అస్థిమితానికి గురవుతూ వుంటుంది. వీటన్నింటి నుండి మనస్సుకి విముక్తి కలిగించాలీ అంటే
,మనస్సుకి ఏదో ఒక్క విషయం మాత్రమే ఇవ్వాలి . అదీ సాత్విక పరమైన అహంకార రహిత మైన భావం ఐతే మంచిది .
మరి సాత్విక ఆలోచనలు అంటే ఏవి ?
నిస్వార్ధం , తృప్తి , సహనం , క్షమ ,కరుణ ,పరోపకారం , పరహితం ,పర్యావరణ హితం ,లోక కళ్యాణ కారకం …
వీటిని మన రోజు వారీ జీవనం లో అన్వయించు కొని మన ” వృత్తి – ప్రవృత్తి -కుటుంబ -సంఘ ” బాధ్యతలను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి