భారతమాతను నేను.....
మీ బంగరు భవితను నేను !మీకు రక్షణ కవచముగా....
హిమవన్నగముల నుంచాను
మీ ఆకలి దప్పులు దీర్చగా...
. జీవనదులను పంచాను !
రత్న గర్భనై... సిరి, సంపదల మిము తుల తూగించేను.. !!
పవిత్ర ధర్మ పిల్లగాలుల...
మిము పునీతుల గావించేను!
కులములు, మతములు, ప్రాం తములతో... భిన్నత్వములో ఏకత్వముగా... అందరి నొకటిగ చూసేను... !
మీరు సమైక్యతా సమగ్రతలతో సహోదరులమని గుర్తు పెట్టుకుని...,
కలిసి, మెలిసి ఉండండి...
శత్రుమూకల ఆటలు సాగనీయక, మానసత్తాను చాటండి.. !
మన జాతి కేతనం విను వీధులలో... స్వేచ్ఛగా ఎగుర వేయండి.... !
జయ - జయ భారత వీరపుత్రులు కల కాలం వర్ధిల్లండి !!
**&&&**
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి