అవును! ఆకలి ఒక దరిద్రం. మంచికి, మర్యాదకు, మానవత్వానికి, సత్యానికి, ధర్మానికి, న్యాయానికి,
గురుభక్తికి గురుతరబాధ్యతకు,
బంధాలకు, అనుబంధాలకు,
నిజమైనప్రేమకు, త్యాగానికి, పవిత్రతకు, అహింసకు, విశ్వాసానికి, నిస్వార్థానికి, నీతి నియమాలకు, అస్తిత్వానికి ఆకలి మంగళం పాడుతుంది. అన్నింటికంటే భయంకరమైనది, అన్నింటికంటే దుష్టమైనది, అన్నింటికంటే అసహ్యమైనది ఆకలి మాత్రమే!
అది ధనపుఆకలి లేదా మదపుఆకలి కావచ్చు. పదవిఆకలి లేదా వ్యామోహపుఆకలి కావచ్చు. అహంకారపుఆకలి లేదా ఆహారపుఆకలి కావచ్చు. ఏదైతేనేం?!
ఆకలితో బాధపడేవాడు మరిక దేనినీ లెక్కచేయడు. ఏరకమైన ఆకలి ఉన్నవాడికి ఆ రకమైన దరిద్రం ఉన్నట్లే సుమా!!!
+++++++++++++++++++++++++
దరిద్రం (చిట్టి వ్యాసం) ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి