ఎక్కడవీ వెన్నెల కిరణాలు? ;- ఎం. వి. ఉమాదేవి
(ఆట వెలది )
చేతులందునిమిడి చేతనగలిగించె
నందరానియట్టి చందమామ!
గతుకులెట్లు దాచె ఘనమైన వెన్నెల?
చెప్పవయ్య ముడిని విప్పవయ్య!

అక్కసిరియునిచ్చె చక్కగా తారలన్ 
చెరకువిల్లురాజు చేరిమురిసె
కొలనులోని కలువ కోమలి యనిపించె
వలపుపిలుపుతోడ వసుధలోన!!




కామెంట్‌లు